Breaking News

నాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ రేషియో క్షీణత

Published on Tue, 12/24/2024 - 08:57

న్యూఢిల్లీ: నాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల ప్రీమియంలో నికర చెల్లింపులు (క్లెయిమ్‌ రేషియో) 2023–24లో స్వల్పంగా తగ్గి 82.52 శాతంగా ఉన్నట్టు బీమారంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) నివేదిక ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 82.95 శాతంగా ఉంది. నాన్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు అన్నీ కలసి గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.90 లక్షల కోట్ల ప్రీమియాన్ని నమోదు చేశాయి. 12.76 శాతం పెరిగింది. ప్రభుత్వరంగ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల ప్రీమియం 9 శాతం వరకు పెరిగి రూ.82,891 కోట్ల నుంచి రూ.90,252 కోట్లకు వృద్ధి చెందింది. ప్రైవేటు రంగ సాధారణ బీమా సంస్థల ప్రీమియం రూ.1.88 లక్షల కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1.58 లక్షల కోట్లుగానే ఉంది. నాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల లాభం రూ.10,119 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ రూ.2,556 కోట్ల మేర నష్టాలను నమోదు చేయడం గమనార్హం.  

నివేదికలోని వివరాలు..

  • 2023–24లో నెట్‌ ఇన్‌కర్డ్‌ (నికర) క్లెయిమ్‌లు 15.39 శాతం పెరిగి రూ.1.72 లక్షల కోట్లకు చేరాయి.  

  • ప్రభుత్వరంగ బీమా సంస్థల ఇన్‌కర్డ్‌ క్లెయిమ్‌ రేషియో 2022–23లో 99.02 శాతంగా ఉంటే, 2023–24లో 97.23 శాతానికి తగ్గింది.

  • ప్రైవేటు రంగ సాధారణ బీమా సంస్థల ఇన్‌కర్డ్‌ క్లెయిమ్‌ రేషియో 76.49 శాతానికి మెరుగుపడింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 75.13 శాతంగా ఉంది.

  • స్టాండలోన్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల ఇన్‌కర్డ్‌ క్లెయిమ్‌ రేషియో 2022–23లో 61.44 శాతంగా ఉంటే, 2023–24లో 63.63 శాతానికి మెరుగుపడింది.

  • స్పెషలైజ్డ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల ఇన్‌కర్డ్‌ క్లెయిమ్‌ రేషియో 66.58 శాతంగా ఉంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 73.71 శాతంగా ఉండడం గమనార్హం.

ఇదీ చదవండి: వాయిస్‌ కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం ప్రత్యేక ప్లాన్‌

  • జీవిత బీమా కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.77 లక్షల కోట్లను పాలసీదారులకు చెల్లించాయి. పాలసీదారుల నుంచి వసూలు చేసిన మొత్తం ప్రీమియంలో చెల్లింపులు 70.22 శాతంగా ఉన్నాయి.  

  • పాలసీల సరెండర్‌లు/ఉపసంహరణలకు సంబంధించిన ప్రయోజనాలు 15 శాతం పెరిగి రూ.2.29 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థల వాటా 58 శాతంగా ఉంది.

  • 2023–24లో 18 జీవిత బీమా కంపెనీలు నికర లాభాలను నమోదు చేశాయి. జీవిత బీమా కంపెనీల ఉమ్మడి లాభం 11 శాతం పెరిగి రూ.47,407 కోట్లకు చేరింది.

  • ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థల (ఎల్‌ఐసీ) లాభం 11.75 శాతం పెరిగితే, ప్రైవేటు జీవిత బీమా కంపెనీల లాభంలో 5 శాతం వృద్ధి నమోదైంది.

  • మొత్తం బీమా వ్యాప్తి 2022–23లో 4 శాతంగా ఉంటే 2023–24లో 3.7 శాతానికి పరిమితమైంది. జీవిత బీమా వ్యాప్తి 3 శాతం నుంచి 2.8 శాతానికి తగ్గగా.. సాధారణ బీమా వ్యాప్తి (ఆరోగ్య బీమా సహా) ఒక శాతం వద్దే స్థిరంగా ఉంది.
     

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి