Breaking News

ఆ కంపెనీల ఆదాయం పెరిగింది: ఆర్‌బీఐ

Published on Thu, 02/27/2025 - 16:07

ముంబై: ప్రైవేట్‌ రంగంలో ఉన్న ఆర్థికేతర లిస్టెడ్‌ కంపెనీల ఆదాయం 2024-25 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో 8 శాతం పెరిగిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 5.5 శాతంగా ఉందని తెలిపింది. జూలై–సెప్టెంబర్‌ కాలంలో అమ్మకాల వృద్ధి 5.4 శాతం నమోదైంది.

డిసెంబర్‌ త్రైమాసికంలో ప్రైవేట్‌ కార్పొరేట్‌ రంగం పనితీరుపై 2,924 ఆర్థికేతర లిస్టెడ్‌ కంపెనీల సంక్షిప్త త్రైమాసిక ఆర్థిక ఫలితాల ఆధారంగా ఆర్‌బీఐ నివేదిక రూపొందించింది. ఆటోమొబైల్స్, రసాయనాలు, ఆహార ఉత్పత్తులు, విద్యుత్‌ యంత్రాల పరిశ్రమలలో అధిక అమ్మకాల జోరు కారణంగా 1,675 లిస్టెడ్‌ ప్రైవేట్‌ తయారీ కంపెనీల ఆదాయ వృద్ధి 7.7 శాతానికి మెరుగుపడింది.

పెట్రోలియం, ఇనుము, ఉక్కు, సిమెంట్‌ పరిశ్రమల ఆదాయం వార్షిక ప్రాతిపదికన తగ్గింది. ఐటీ కంపెనీల టర్నోవర్‌ 6.8 శాతం ఎగిసింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 3.2 శాతంగా ఉంది. ముడి పదార్థాలపై తయారీ కంపెనీల ఖర్చులు 6.3 శాతం దూసుకెళ్లాయి. వేతనాల ఖర్చు అధికంగా 9.5 శాతం పెరిగింది. ఇది ఐటీలో 5 శాతం, ఐటీయేతర సేవల కంపెనీల్లో 12.4 శాతం అధికమైంది. 2024 అక్టోబర్‌–డిసెంబర్‌లో లిస్టెడ్‌ నాన్‌–ఫైనాన్షియల్‌ కంపెనీల ప్రాఫిట్‌ మార్జిన్‌ వరుసగా 50 బేసిస్‌ పాయింట్లు వృద్ధి చెంది 16.2 శాతానికి చేరుకుందని ఆర్‌బీఐ తెలిపింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)