Breaking News

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌లపై బ్యాడ్‌ న్యూస్‌

Published on Sat, 12/07/2024 - 13:19

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఇది చేదు వార్త. క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు, మర్చెంట్‌ లావాదేవీలు చేస్తే వాటిపై రివార్డు పాయింట్లు ఇవ్వడాన్ని ఎస్‌బీఐ నిలిపివేసింది. ఇది డిసెంబర్ 1 నుండి అమల్లోకి వచ్చింది. అయితే, ఈ కొత్త నియమం అన్ని ఎస్‌బీఐ కార్డ్‌లకు కాదు. రివార్డ్ పాయింట్లు వర్తించని కార్డుల జాబితాను ఎస్‌బీఐ విడుదల చేసింది.

జాబితాలోని కొన్ని కార్డ్‌లు
⇒ ఎస్‌బీఐ ఆరమ్‌ కార్డ్
⇒ ఎస్‌బీఐ ఎలైట్‌ కార్డ్
⇒ ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్‌ అడ్వాంటేజ్
⇒ ఎస్‌బీఐ కార్డ్ పల్స్
⇒ సింప్లీ క్లిక్‌ ఎస్‌బీఐ కార్డ్‌
⇒ సింప్లీ క్లిక్‌ అడ్వాంటేజ్ ఎస్‌బీఐ కార్డ్‌
⇒ ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్
⇒ ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్ అడ్వాంటేజ్
⇒ ఎస్‌బీఐ కార్డ్ ప్లాటినం
⇒ ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్ ప్రో
⇒ ఎస్‌బీఐ కార్డ్ ప్లాటినం అడ్వాంటేజ్
⇒ గోల్డ్ ఎస్‌బీఐ కార్డ్
⇒ గోల్డ్ క్లాసిక్ ఎస్‌బీఐ కార్డ్
⇒ గోల్డ్ డిఫెన్స్ ఎస్‌బీఐ కార్డ్

యుటిలిటీ చెల్లింపులపై 1% రుసుము
రివార్డ్‌ పాయింట్ల తొలగింపుతో పాటు ఎస్‌బీఐ యుటిలిటీ చెల్లింపులపై నిబంధనలను కూడా మార్చింది. ఒక బిల్లింగ్ సైకిల్‌లో మీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ నుండి మొత్తం యుటిలిటీ చెల్లింపు రూ. 50,000 దాటితే, 1 శాతం రుసుము వర్తిస్తుంది. ఈ నిబంధన కూడా డిసెంబర్ 1 నుండి అమలులోకి వచ్చింది.

దేశంలో డెబిట్‌కార్డుల మార్కెట్‌ వాటాలో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)    అగ్రస్థానంలో ఉండగా, క్రెడిట్‌కార్డుల్లో ప్రైవేట్‌రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అగ్రగామిగా ఉంది. హామీ లేని రుణాల మంజూరులో అప్రమత్తంగా ఉండాలన్న ఆర్బీఐ హెచ్చరికల నేపథ్యంలో ఏడాది క్రితంతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరులో కొత్త   క్రెడిట్‌కార్డుల జారీ 45 శాతం తగ్గిందని పరిశోధనా నివేదికలు పేర్కొంటున్నాయి.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి