Breaking News

ఈక్విటీలపై ఎల్‌టీసీజీ పన్ను రద్దు లేదు

Published on Tue, 07/21/2026 - 12:11

ఈక్విటీ షేర్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులపై విధిస్తున్న దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్‌టీసీజీ) పన్నును ఎత్తివేసే ఆలోచన ఏదీ ప్రస్తుతం పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతికూల మార్కెట్ వార్తలు, నిపుణుల అంచనాల నడుమ పెట్టుబడిదారుల్లో నెలకొన్న ఊహాగానాలకు తెరదించుతూ లోక్‌సభలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.

పార్లమెంట్ ఉభయసభల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక సమాధానమిస్తూ.. పన్ను విధానాలు, మూలధన లాభాల పన్ను రేట్లను ప్రభుత్వం వార్షిక బడ్జెట్ రూపకల్పన సమయంలోనే స్థూల ఆర్థిక పరిస్థితులను బట్టి సమీక్షిస్తుందని, ప్రస్తుతానికి ఎల్‌టీసీజీని రద్దు చేసే ఎలాంటి ప్రతిపాదన లేదని పేర్కొన్నారు.

ఖజానాకు భారీగా పన్ను ఆదాయం

భారత మార్కెట్లలో రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యం ఊపందుకోవడంతో ఎల్‌టీసీజీ ద్వారా ప్రభుత్వానికి లభించే రాబడి భారీగా పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ (అసెస్మెంట్ ఇయర్ 2025-26) ఈక్విటీ ఎల్‌టీసీజీ పన్ను వసూళ్లు ఏకంగా 78.8 శాతం పెరిగి రూ.1,29,158 కోట్లకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (ఏవై 2024-25) ఈ వసూళ్లు రూ.72,249 కోట్లుగా నమోదయ్యాయి.

ఎఫ్‌పీఐలతో సమానమైన పన్ను నిబంధనలు

విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులకు పన్ను మినహాయింపులపై వస్తున్న వార్తలను కూడా ప్రభుత్వం ఖండించింది. ఈక్విటీలపై విధిస్తున్న 12.5% ఎల్‌టీసీజీ పన్ను రేటు స్వదేశీ రిటైల్ ఇన్వెస్టర్లకు, విదేశీ ఇన్వెస్టర్లకు సమానంగానే వర్తిస్తుందని తెలిపింది. ఎఫ్‌పీఐలకు ఇటీవల ప్రకటించిన పన్ను మినహాయింపు కేవలం ప్రభుత్వ సెక్యూరిటీల పెట్టుబడుల వరకే పరిమితమని స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు పైబడిన ఈక్విటీ లాభాలపై 12.5% చొప్పున ఎల్‌టీసీజీ పన్ను అమలులో ఉంది. దేశీయ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన పన్ను రాబడిని సమకూరుస్తున్న ఈ విధానాన్ని మున్ముందు కూడా కొనసాగించడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.

ఇదీ చదవండి: మళ్లీ టాప్ గేర్‌లోకి పసిడి.. నేటి ధరలు ఇలా..

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)