Breaking News

ఫోన్‌పే, పేటీఎంలో ఇక రెంటు కట్టడం కష్టం!

Published on Thu, 09/18/2025 - 15:22

ఫోన్ పే, పేటిఎం లేదా క్రెడ్ వంటి మొబైల్ యాప్‌లలో క్రెడిట్ కార్డు ద్వారా ప్రతి నెలా రెంటు చెల్లించేవారికి ఇకపై కష్టతరం కానుంది. అనేక ఫిన్ టెక్ ప్లాట్‌ఫామ్ లు ఇప్పుడు తమ రెంటు పేమెంట్‌ సేవలను నిలిపివేశాయి. ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లించడం ఒక ప్రసిద్ధ ధోరణిగా మారింది. ఎందుకంటే ఈ చెల్లింపులపై వినియోగదారులకు రివార్డ్ పాయింట్లతోపాటు వడ్డీ లేని క్రెడిట్ వ్యవధిని ఆస్వాదించే అవకాశం కలిగేది. అయితే ఆర్బీఐ తాజా నిబంధనలను అనుసరించి ఈ సౌలభ్యం ఇప్పుడు కనుమరుగవుతోంది.

చెల్లింపు సేవలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెప్టెంబర్ 15న ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఈ చర్య ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ రివార్డులను సంపాదించడానికి లేదా వారి ఆర్థిక వ్యవహారాలను నిర్వహించడానికి రెంటు చెల్లింపులపై ఆధారపడిన వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. వారు ఇప్పుడు ప్రత్యక్ష బ్యాంకు బదిలీలు లేదా చెక్కు చెల్లింపులు వంటి సాంప్రదాయ పద్ధతులకు తిరిగి రావాల్సి ఉంటుంది.

ఆర్బీఐ కొత్త నిబంధనలు
సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. తమతో ప్రత్యక్ష ఒప్పందాలను కలిగి ఉన్న, పూర్తి కేవైసీ ప్రక్రియను పూర్తి చేసిన వ్యాపారుల లావాదేవీలను మాత్రమే ప్రాసెస్ చేయడానికి పేమెంట్‌ అగ్రిగేటర్లు (PA), పేమెంట్‌ గేట్ వేలకు అనుమతి ఉంటుంది. తత్ఫలితంగా, ఈ యాప్‌లు ఇకపై తమ ప్లాట్ ఫామ్ లలో అధికారిక వ్యాపారులుగా నమోదు కాని భూస్వాములకు అద్దె చెల్లింపులను సులభతరం చేయలేవు.

ఆర్బీఐ ఇటీవలి చర్యకు ముందే బ్యాంకులు ఇలాంటి లావాదేవీలను పరిమితం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఉదాహరణకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జూన్ 2024 నాటికే క్రెడిట్ కార్డు ద్వారా చేసే అద్దె చెల్లింపులపై 1% వరకు రుసుమును ప్రవేశపెట్టింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ కార్డులు కూడా ఈ చెల్లింపులపై రివార్డ్ పాయింట్లను అందించడం నిలిపివేశాయి. ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పేతో సహా అనేక ప్లాట్ ఫామ్‌లు మార్చి 2024 నాటికి ఈ సేవను నిలిపివేసినప్పటికీ తర్వాత పాక్షికంగా వెసులుబాటు కల్పిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు కేవైసీ ప్రక్రియను కఠినతరం చేయడంతో ఇకపై అనధికార రెంటు చెల్లింపులకు అవకాశం ఉండదు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)