Breaking News

ఇకపై రోడ్డుపై పార్కింగ్ చేస్తే జేబుకు చిల్లే!

Published on Fri, 08/14/2026 - 08:48

ఇంటి ముందు సొంత కారును నిలిపే సౌకర్యం కూడా ఇకపై ఉచితం కాదు. అవును.. దేశంలోనే ఐటీ రాజధానిగా గుర్తింపు పొందిన బెంగళూరులో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య, రోడ్ల దురాక్రమణను అరికట్టేందుకు పట్టణాభివృద్ధి శాఖ ‘గ్రేటర్ బెంగళూరు అథారిటీ (పార్కింగ్) నిబంధనలు-2026’ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ విధానం ప్రకారం నివాస ప్రాంతాల్లోని రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేస్తే రకాన్ని బట్టి ఏటా గరిష్ఠంగా రూ.25,000 వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

వాహన రకాన్ని బట్టి వార్షిక రుసుములు

ప్రతిపాదిత డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం నివాస వీధుల్లో పార్కింగ్ చేయడానికి వార్షిక పర్మిట్ తప్పనిసరి. అందుకోసం హ్యాచ్‌బ్యాక్ / చిన్న కార్లకు ఏటా రూ.15,000, సెడాన్ కార్లకు ఏటా రూ.20,000, ఎస్‌యూవీలకు ఏటా రూ.25,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పర్మిట్ కాలపరిమితి ఏడాది మాత్రమే. అయితే, భవన నిర్మాణ నిబంధనలకు లోబడి సొంత స్థలంలో నిర్ణీత పార్కింగ్ సదుపాయం ఉన్న నివాసాల వద్ద మాత్రమే పర్మిట్లు మంజూరు చేస్తారు. రహదారి వెడల్పు కనీసం 6 మీటర్లు ఉండి ట్రాఫిక్‌కు ఆటంకం కలగని చోట్లే ఈ పర్మిట్‌ చెల్లుబాటు అవుతుంది.

ఆన్-స్ట్రీట్, ఆఫ్-స్ట్రీట్ చార్జీలు

వాణిజ్య, ప్రధాన రహదారులను ఏ, బీ, సీ కేటగిరీలుగా వర్గీకరించారు. ఆన్-స్ట్రీట్ పార్కింగ్‌లో భాగంగా కార్లకు గంటకు రూ.40-రూ.80 వరకు, ద్విచక్ర వాహనాలకు రూ.20-రూ.40 వరకు వసూలు చేయనున్నారు. రెండు గంటలు దాటితే చార్జీలు మరింత పెరుగుతాయి. బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయాలను ప్రోత్సహించేందుకు ఆఫ్-స్ట్రీట్ చార్జీలను తగ్గించారు. కార్లకు నెలకు రూ.2,000-రూ.4,000 కాగా రాత్రి వేళల్లో (రాత్రి 8-ఉదయం 8 వరకు) 50% రాయితీ ఇవ్వనున్నారు.

అభ్యంతరాలకు 30 రోజుల గడువు

ప్రజాభిప్రాయాలు, అభ్యంతరాల సమర్పణకు ప్రభుత్వం 30 రోజుల గడువు ఇచ్చింది. వాహనాల విచ్చలవిడి పార్కింగ్‌ను నియంత్రించాలని చూస్తుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇది మధ్యతరగతి ప్రజలపై అదనపు భారమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

#

Tags : 1

Videos

రాజమండ్రి ప్రియాంక ఘటనపై విద్యార్థులు భారీ ర్యాలీ

సంగారెడ్డిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ

ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన నిజాలు బయట పెట్టిన లాయర్

నల్గొండ జిల్లాలో రూపారెడ్డి హత్య కేసులో వీడని మిస్టరీ

గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి కుట్ర.. చంద్రబాబును ఏకిపారేసిన అమర్నాథ్

నన్ను, హైదరాబాద్ రమ్మని చెప్పి , రాహుల్ సిప్లిగంజ్ బాధితురాలి సంచలన వీడియో...

మిల్లుల్లో మాయం అవుతున్న ప్రభుత్వ ధాన్యం

కూటమికి మొట్టికాయలు సీదిరి అప్పలరాజుకు బెయిల్

విజయ నగరంలో దారుణం ప్రియురాలిని చంపి..

Viral Video: దంపతులపై కుక్క‌ దాడి... భార్యాభర్తలకు తీవ్ర గాయాలు వైరల్ వీడియో

Photos

+5

అఖిల్‌ రాజ్‌, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

వెకేషన్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు)

+5

'అమీర్ లోగ్' హీరోయిన్ వేద జలంధర్ బ్యూటీ ఫుల్ (ఫొటోలు)

+5

మిర్చి కంటే ఘాటుగా 'టాక్సిక్' కియారా గ్లామర్ (ఫొటోలు)

+5

హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు)

+5

'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

కర్నూలులో వైఎస్‌ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు)

+5

'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్‌ (ఫొటోలు)