Breaking News

ఎలక్ట్రిక్‌ వాహనాలకు సబ్సిడీ.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు

Published on Thu, 09/05/2024 - 16:42

ఎలక్ట్రిక్‌ వాహనాలకు అందించే సబ్సిడీ విషయమై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా పెరుగుతోందని, వినియోగదారులు స్వచ్ఛమైన ఇంధనాలతో నడిచే వాహనాల కొనుగోలు వైపు మొగ్ చూపుతున్న క్రమంలో విక్రయాలను ప్రోత్సహించడానికి ఇక ప్రోత్సాహకాలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

"నా అభిప్రాయం ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఇకపై ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదు" అని న్యూఢిల్లీలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ ఎన్‌ఈఎఫ్‌ సమ్మిట్‌లో వ్యాఖ్యానించారు. ఎలక్ట్రిక్‌, సీఎన్‌జీ వాహనాలు కొనుగోలు చేయడానికే వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని అన్నారాయన.

శిలాజ ఇంధన వాహనాలతో పోల్చితే ఎలక్ట్రిక్‌ వాహనాలపై తక్కువ జీఎస్టీ విధించడం వల్ల ఆ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు ఇప్పటికే ప్రయోజనాన్ని అందిస్తోందన్నారు. ఇక భారీగా జరుగుతన్న పెట్రోల్‌, డీజిల్‌ వంటి  శిలాజ ఇంధన దిగుమతులకు కేంద్ర ప్రభుత్వం ఒక పరిష్కారాన్ని కనుగొనవలసిన అవసరం ఉందన్నారు.అయితే ఇది పెట్రోల్, డీజిల్ కార్లపై అధిక పన్నులకు దారితీయదని స్పష్టం గడ్కరీ చేశారు.

త్వరలో ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సులు
"ప్రజా రవాణాలో ఎలక్ట్రిక్ వాహనాలను, ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులను  ఉపయోగించడం  కాలుష్య స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.శిలాజ ఇంధన దిగుమతులను తగ్గించడానికి దోహదపడుతుంది" అన్నారు. త్వరలో ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని కూడా మంత్రి తెలిపారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)