Breaking News

గుడ్‌న్యూస్‌.. 20 కిలోమీటర్ల వరకు టోల్‌ ఫీజు లేదు

Published on Wed, 09/11/2024 - 18:55

ఫంక్షనల్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్‌ఎస్‌ఎస్) ఉన్న వాహనాలు హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో రోజుకు 20 కిలోమీటర్ల వరకు టోల్ ఫీజు లేకుండా ప్రయాణించడానికి ప్రభుత్వం అనుమతిస్తోంది. ఈ మేరకు జాతీయ రహదారుల రుసుము (రేట్ల నిర్ణయం, వసూళ్లు) నిబంధనలు- 2008ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సవరించింది. కొత్త నిబంధనలు మంగళవారం నుండి అమలులోకి వచ్చినట్లు ప్రభుత్వం నోటిఫికేషన్‌లో తెలిపింది.

కొత్త నిబంధనల ప్రకారం.. జీఎన్‌ఎస్‌ఎస్ వాహనాలు 20 కిలోమీటర్లు దాటి ఎంత  దూరం  ప్రయాణిస్తాయో అంత దూరంపై మాత్రమే ఇప్పుడు రుసుము వసూలు చేస్తారు. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆన్-బోర్డ్ యూనిట్ అమర్చిన వాహనాల కోసం ప్రత్యేకమైన లేన్‌ను కేటాయిస్తారు. ఇతర వాహనాలు ఈ  లేన్‌లోకి ప్రవేశించినట్లయితే రెండు రెట్ల రుసుమును చెల్లించాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: టోల్‌ ఫీజు మినహాయింపు ఉంటుందా?

ఎంపిక చేసిన జాతీయ రహదారులలో ఫాస్ట్‌ట్యాగ్‌తో పాటు జీఎన్‌ఎస్‌ఎస్‌ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని పైలట్ ప్రాతిపదికన అమలు చేయాలని నిర్ణయించినట్లు జూలైలో హైవే మంత్రిత్వ శాఖ తెలిపింది. కర్ణాటకలోని ఎన్‌హెచ్‌-275లోని బెంగళూరు-మైసూర్ సెక్షన్, హర్యానాలోని ఎన్‌హెచ్‌-709లోని పానిపట్-హిసార్ సెక్షన్‌లో జీఎన్‌ఎస్‌ఎస్‌ ఆధారిత వినియోగదారు రుసుము వసూలు వ్యవస్థకు సంబంధించి పైలట్ అధ్యయనం జరిగిందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)