Breaking News

వొడాఫోన్‌ ఐడియాకు ఉపశమనంపై స్పష్టత

Published on Tue, 08/26/2025 - 20:08

రుణ భారంతో సతమతమవుతున్న మొబైల్‌ టెలికం రంగ దిగ్గజం వొడాఫోన్‌ ఐడియాకు ఆర్థిక ఉపశమనాన్ని కలిగించే యోచన చేయడంలేదని టెలికం శాఖ స్పష్టం చేసింది. కంపెనీ స్థూల సర్దుబాటు ఆదాయం(ఏజీఆర్‌) బకాయిలపై ప్రస్తుతం తమవద్ద ఎలాంటి ప్రణాళికలు లేదా ఆలోచనలు లేవని కమ్యూనికేషన్స్‌ శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.

‘ఇటీవల కంపెనీకున్న భారీ రుణ భారాన్ని ఈక్విటీగా మార్పు చేసుకున్నాం. ప్రభుత్వ ఆలోచన ప్రకారం ఇది చేపట్టాం. ప్రభుత్వం చేయదలచినదంతా ఇప్పటికే పూర్తి చేసింది. ప్రస్తుతం వీటిపై ఎలాంటి సమాలోచనలూ చేయడంలేదు’ అంటూ స్పష్టతనిచ్చారు. స్పెక్ట్రమ్‌ వేలం బకాయిలకుగాను మార్చిలో ప్రభుత్వం రూ. 36,950 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను సొంతం చేసుకోవడం ద్వారా వొడాఫోన్‌ ఐడియాలో అతిపెద్ద వాటాదారుగా అవతరించిన సంగతి తెలిసిందే. ఇంతక్రితం 2023లోనూ ప్రభుత్వం రూ. 16,000 కోట్ల బకాయిలకుగాను వొడాఫోన్‌ ఐడియాలో 33 శాతం వాటాను అందుకోవడం గమనార్హం! 2025 జూన్‌కల్లా కంపెనీ ఏజీఆర్‌ లయబిలిటీ రూ.75,000 కోట్లుగా నమోదైంది.

ఇదీ చదవండి: మార్వాడీలు వ్యాపారంలో ఎందుకు విజయం సాధిస్తారు?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)