Breaking News

సబ్సిడీ ఎత్తేస్తే అంతే.. సీఈవో ఆందోళన!

Published on Sun, 01/21/2024 - 17:02

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని ఉపసంహరించుకోవడంపై ఎలక్ట్రిక్ టూవీలర్‌ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్య ఎలక్ట్రిక్ టూవీలర్‌ పరిశ్రమలో ఒకటీ రెండు సంవత్సరాల వృద్ధి స్తబ్దతకు దారితీయవచ్చని ఆయన అంటున్నారు.

పరిశ్రమ మనుగడ కోసం రాయితీలపైనే పూర్తిగా ఆధారపడనప్పటికీ  వచ్చే ఏప్రిల్‌లోనే సబ్సిడీని నిలిపివేస్తే కంపెనీలు మరింత కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ఈ దృష్టాంతం పరిశ్రమ వృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో జాప్యానికి దారి తీస్తుంది. ఈ ఏడాది మార్చిలో ముగియనున్న ఫేమ్‌2(FAME-II) పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే గత ఏడాది జూన్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీ మొత్తాన్ని తగ్గించింది.

ఉన్నట్టుండి సబ్సిడీని తగ్గించడం వల్ల కలిగిన ప్రతికూల ప్రభావాన్ని తరుణ్ మెహతా ఎత్తిచూపారు. దీనివల్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ 2023లో వృద్ధిని కోల్పోయిందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడంలో పేరుగాంచిన చండీగఢ్ ఫేమ్‌ స్కీమ్‌ లేకపోతే ప్రభావితం కావచ్చన్నారు.

దేశం అంతటా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల స్వీకరణను ప్రోత్సహించడంలో ఫేమ్‌ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది కాలుష నియంత్రణ, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దోహదం చేస్తోంది. అయితే బ్యాటరీ ఖర్చులు అధికంగా ఉండటం, విడి భాగాలపై సరఫరా పరిమితులు ఎలక్ట్రిక్ వాహనాలను మరింత ఖరీదైనవిగా మార్చాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)