Breaking News

యువ ఆవిష్కర్తలకు బంపర్‌ ఆఫర్‌..

Published on Thu, 06/11/2026 - 14:44

డిగ్రీ సర్టిఫికేట్లు, క్లాస్‌రూమ్ పాఠాలు మాత్రమే జీవితాన్ని నిర్దేశించలేవని నమ్మే యువ మేధావులకు కొన్ని సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. సాంప్రదాయ విశ్వవిద్యాలయాల చట్రం నుంచి బయటకు వచ్చి ప్రపంచాన్ని మార్చే సరికొత్త ఆలోచనలతో దూసుకుపోయే యువ ఆవిష్కర్తల కోసం ప్రతిష్టాత్మక ‘థీల్ ఫెలోషిప్ 2026’ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు ఏకంగా 2,50,000 డాలర్లు (సుమారు రూ.2.10 కోట్లు) భారీ గ్రాంట్‌తో పాటు అంతర్జాతీయ మార్గదర్శకత్వాన్ని (మెంటార్‌షిప్‌) ఈ ప్రోగ్రామ్ అందించనుంది.

ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్, పేపాల్ సహ-వ్యవస్థాపకుడు పీటర్ థీల్ 2011లో స్థాపించిన ఈ ఫెలోషిప్, గ్లోబల్ స్టార్టప్ రంగాన్ని శాసించే అత్యుత్తమ కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది.

అసలు ఏంటి ఈ థీల్ ఫెలోషిప్?

సాధారణంగా ఉన్నత విద్య కోసం లక్షలాది రూపాయల అప్పులు చేసి డిగ్రీలు పూర్తి చేశాక ఉద్యోగాల కోసం వెతకడం ఒక సంప్రదాయం. కానీ, థీల్ ఫెలోషిప్ దీనికి భిన్నమైన ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ ఫెలోషిప్‌కు ఎంపికైన యువకులు తమ రెండేళ్ల కాలపరిమితిలో కాలేజీ చదువులకు స్వస్తి చెప్పాలి. చదువు పక్కన పెట్టి తాము నమ్మిన సరికొత్త వ్యాపార ఆలోచనలను లేదా పరిశోధనలను నిజం చేయడంపైనే పూర్తి దృష్టి సారించాల్సి ఉంటుంది.

ఫెలోషిప్ ద్వారా లభించే ప్రయోజనాలు

  • ఎలాంటి ఈక్విటీ (వాటా) ఆశించకుండా రెండేళ్ల కాలానికి 2,50,000 డాలర్లు సహాయం.

  • సిలికాన్ వ్యాలీలోని అగ్రశ్రేణి పెట్టుబడిదారులు (వెంచర్‌ క్యాపిటలిస్ట్‌లు), శాస్త్రవేత్తలు, విజయవంతమైన పారిశ్రామికవేత్తలతో నేరుగా పనిచేసే అవకాశం.

  • విద్యా రుణాలు, ఫీజుల ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా టెక్నాలజీలు, ఉత్పత్తులను రూపొందించుకునే స్వేచ్ఛ.

  • ఇప్పటికే ఈ ఫెలోషిప్ ద్వారా లబ్ధి పొంది ప్రస్తుతం బిలియన్ డాలర్ల కంపెనీలను నడుపుతున్న పూర్వ విద్యార్థుల గ్లోబల్ కమ్యూనిటీలో సభ్యత్వం.

ఏయే రంగాల ప్రాజెక్టులకు ప్రాధాన్యత?

టెక్నాలజీ మారుతున్న వేగానికి అనుగుణంగా భవిష్యత్తును మార్చే సత్తా ఉన్న ఏ రంగంలోని ప్రాజెక్ట్ అయినా ఈ ఫెలోషిప్‌కు అర్హమైనదే. ముఖ్యంగా కింది రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు.

రంగంప్రాధాన్యత గల అంశాలు
సాంకేతికతఏఐ, మెషిన్ లెర్నింగ్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌
ఆరోగ్యం, జీవశాస్త్రంబయోటెక్నాలజీ, మెడికల్ ఇన్నోవేషన్స్, హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్
పర్యావరణంగ్రీన్ ఎనర్జీ, వాతావరణ మార్పుల నివారణ, సుస్థిర అభివృద్ధి
ఇంజినీరింగ్అడ్వాన్స్‌డ్‌ ఇంజినీరింగ్, ఎడ్యుకేట్‌, సోషల్ వెంచర్స్

అర్హతలు

ఈ ఫెలోషిప్ కోసం ఎటువంటి నిర్దిష్ట విద్యా అర్హతలు లేదా డిగ్రీలు అవసరం లేదు. కేవలం అసాధారణ సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే బలమైన ఆశయం, సాంప్రదాయ పద్ధతులను సవాలు చేసే ధైర్యం ఉన్న యువత ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతీ యువకులకు ఈ అవకాశం అందుబాటులో ఉంది.

దరఖాస్తు విధానం

ఆసక్తి గల అభ్యర్థులు థీల్ ఫెలోషిప్ అధికారిక వెబ్‌సైట్(https://thielfellowship.org/) ద్వారా ఆన్‌లైన్‌లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు తమ వ్యక్తిగత నేపథ్యం, తాము చేస్తున్న లేదా చేయబోయే ప్రాజెక్ట్ వివరాలను సమర్పించాలి. తమ ఆలోచనల వెనుక ఉన్న దీర్ఘకాలిక లక్ష్యాలు, ఈ ఫెలోషిప్ తమకు ఎలా ఉపయోగపడుతుందనే అంశాలను స్పష్టంగా వివరించాల్సి ఉంటుంది. అత్యంత పారదర్శకంగా, పోటీతత్వంతో కూడిన స్క్రీనింగ్ ప్రక్రియ ద్వారా తుది విజేతలను ఎంపిక చేస్తారు.

ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. వరుసగా రెండో రోజు!

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)