Breaking News

క్రెడిట్‌ హిస్టరీ లేదని లోన్‌ రిజెక్ట్‌ చేయొచ్చా? ఆర్థిక శాఖ స్పష్టత

Published on Thu, 08/21/2025 - 13:25

క్రెడిట్‌ స్కోర్‌, హిస్టరీ అనేది బ్యాంకులు, ఇతర రుణ సంస్థల​ నుంచి లోన్‌ పొందడంలో కీలకంగా మారింది. అయితే తొలిసారి రుణం కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఎలాంటి క్రెడిట్‌ హిస్టరీ ఉండదు. ఇలాంటి వారికి క్రెడిట్‌ హిస్టరీ లేదన్న కారణంతో లోన్‌ మంజూరు చేయకుండా రుణ సంస్థలు తిరస్కరిస్తాయన్న ఆందోళన ఉంటుంది. దీనికి సంబంధించి తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైఖరిని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

మొదటిసారి రుణగ్రహీతలకు క్రెడిట్ హిస్టరీ లేనందున రుణ దరఖాస్తును తిరస్కరించరాదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది, ఇటీవల పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి క్రెడిట్ స్కోర్ కు సంబంధించిన అనేక అంశాలను స్పష్టం చేశారు.  సిబిల్ నివేదికలు, క్రెడిట్ రిపోర్టులను జారీ చేయడానికి అధీకృత ఏజెన్సీలు, మొదటిసారి రుణానికి దరఖాస్తు చేయడానికి క్రెడిట్ హిస్టరీ తప్పనిసరా వంటి వాటిపై స్పష్టత ఇచ్చారు.

2025 జనవరి 6న ఆర్బీఐ విడుదల చేసిన మాస్టర్ డైరెక్షన్ ప్రకారం, అన్ని క్రెడిట్ ఇన్‌స్టిట్యూషన్లు (CI) తమ విధానాల్లో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.  ఆర్బీఐ పేర్కొన్న ప్రకారం,  కనీస క్రెడిట్ స్కోరు అవసరం లేదు. అంటే ఆర్బీఐ ఎలాంటి క్రెడిట్‌ స్కోరు నిర్దేశించలేదు. కాబట్టి బ్యాంకులు తమ సొంత వాణిజ్య పరమైన విధానాల ఆధారంగా రుణ దరఖాస్తులను పరిశీలించవచ్చు.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)