Breaking News

గడ్కరీ సతీమణి పండించిన ఉల్లి: ఒక్కొక్కటి కేజీ బరువు! అదెలాగంటే?

Published on Sun, 06/01/2025 - 11:20

నితిన్ గడ్కరీ కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిగా విధులు నిర్వహిస్తూనే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. పెట్రోల్ & డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయ వెహికల్స్ వినియోగించాలని చెబుతూ.. హైడ్రోజన్ కారులో పార్లమెంటుకు వెళ్లి, పర్యావరణంపై ఆయనకున్న మక్కువను చూపించారు. భర్త బాటలోనే నడుస్తూ.. గడ్కరీ సతీమణి ఆర్గానిక్ పద్దతిలో, మల్చింగ్ పేపర్ టెక్నాలజీతో ఉల్లిని పండించారు.

ఉల్లిని అందరూ పండిస్తారు.. అందులో వింతేముంది అనుకోవచ్చు. కానీ వీరు పండించిన ఉల్లి ఒక్కొక్కటి సుమారు 800 గ్రాముల నుంచి 1000 గ్రాములు లేదా ఒక కేజీ బరువు ఉన్నాయి. ఈ విషయాన్ని గడ్కరీ తన ఎక్స్ ఖాతలో పేర్కొన్నారు. ''నా భార్య కాంచన్, నాగ్‌పూర్‌లోని ధపేవాడలోని మా భక్తి ఫామ్‌లో, మల్చింగ్ పేపర్ టెక్నిక్ ఉపయోగించి ఒక ప్రత్యేకమైన ప్రయోగం చేసి, ఒక కిలో వరకు బరువున్న సేంద్రీయ ఉల్లిపాయలను విజయవంతంగా ఉత్పత్తి చేశారు'' అని ట్వీట్ చేశారు.

దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పొలం దున్నడం.. ఉల్లి విత్తనాలను నాటు వేయడం వంటివన్నీ చూడవచ్చు. మొత్తానికి ఇక్కడ పండిన ఉల్లి సాధారణ ఉల్లికంటే.. చాలా పెద్దవిగా ఉన్నాయి. ఒక రకంగా వీటిని బాహుబలి ఉల్లి అని కూడా చెప్పొచ్చు.

మల్చింగ్ పేపర్ టెక్నాలజీ
మల్చింగ్ పేపర్ టెక్నాలజీలో.. మట్టి బెడ్ మీద ఒక ప్లాస్టిక్ షీట్ కప్పుతారు. దీనిపైన చిన్న రంధ్రాలు చేసి.. ఉల్లినారు నాటుతారు. ఈ విధంగా వ్యవసాయం చేయడం వల్ల నీటి వృధా తగ్గుతుంది. కలుపు మొక్కలను నివారించవచ్చు. ఈ ఉల్లిని పండించడానికి కాంచన్ గడ్కరీ సేంద్రీయ పద్ధతులనే ఉపయోగించారు. అంతే కాకుండా.. ఉల్లి విత్తనాలను ప్రత్యేకంగా నెదర్లాండ్స్ నుంచి తెప్పించి ప్రయోగం చేశారు.

ఇదీ చదవండి: జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక

నాణ్యమైన విత్తనాలు ఉపయోగించి.. సహజ సిద్దమైన పద్దతులతో వ్యవసాయం చేస్తే తప్పకుండా మంచి దిగుబడి ఉంటుందని గడ్కరీ దంపతులు చెబుతున్నారు. అంతే కాకుండా.. స్థానిక రైతులకు ఈ పద్దతిపై అవగాహన కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కాంచన్ గడ్కరీ పేర్కొన్నారు.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు