Breaking News

‘డిస్కౌంట్‌ ధరకు హెల్మెట్‌’

Published on Thu, 09/05/2024 - 12:05

ద్విచక్ర వాహన తయారీదారులు తమ కస్టమర్లకు డిస్కౌంట్‌ ధరకు హెల్మెట్‌ అందించాలని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. 2022లో దేశంలో జరిగిన ప్రమాదాల్లో హెల్మెట్‌ లేకపోవడం వల్ల 50,029 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

‘ఏటా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. వాటిలో ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణించేవారు అధికంగా మృత్యువాత పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే సమయంలోనే తయారీదారులను డిస్కౌంట్‌ ధరకు హెల్మెట్లు ఇవ్వమని అడగండి. తయారీ కంపెనీలు కూడా కొంత తగ్గింపుతో వాహనదారులకు హెల్మెట్లు ఇస్తే చాలా మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది. ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో గాయపడుతున్న ద్విచక్రవాహనదారుల్లో దాదాపు 43 శాతం మంది మరణిస్తున్నారు’ అని మంత్రి అన్నారు.

ఇదీ చదవండి: జీవిత పాఠాలు నేర్పిన గురువులు

పాఠశాల బస్సులు నిలిపేందుకు సరైన పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. మోటారు వాహనాల (సవరణ) చట్టం, 2019 ట్రాఫిక్ నేరాలపై భారీ జరిమానాలు విధించిందని చెప్పారు. దేశంలోని ప్రతి టౌన్‌లో డ్రైవింగ్ స్కూల్‌ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)