Breaking News

రేపు నితిన్ గడ్కరీ ప్రారంభించనున్న కొత్త ప్రోగ్రామ్ ఇదే..

Published on Mon, 08/21/2023 - 19:02

Bharat NCAP: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్' (భారత్ ఎన్‌సీఏపీ) రేపు (మంగళవారం) ప్రారంభించనున్నట్లు మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

భారత్ ఎన్‌సీఏపీ భారతీయ ఆటోమొబైల్స్ భద్రతా ప్రమాణాలను పెంచడంతోపాటు.. అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ కార్ల ప్రతిష్టతను పెంచడానికి తోడ్పడుతుంది. తద్వారా రానున్న కొత్త ఉత్పత్తులు (కార్లు) మరింత పటిష్టమైన భద్రతను కలిగి ఉంటాయి. దీనికింద కార్లను క్రాష్ టెస్ట్ చేసి వాటికి సేఫ్టీ రేటింగ్ కూడా అందించడం జరుగుతుంది.

సేఫ్టీ రేటింగ్ ఆధారంగా కారు భద్రతను నిర్థారిస్తారు. ఇది కార్ల కొనుగోలుదారులకు, భారత ఆర్థిక వ్యవస్థ పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మన దేశంలో తయారయ్యే కార్లు అంతర్జాతీయ మార్కెట్లో నాణ్యత లేని కార్లుగా పరిగణించబడుతున్నాయి. దీనికి చెప్ పెట్టడానికి ఈ ప్రోగ్రామ్ ప్రారంభమవుతోంది. దీని ద్వారా అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతయ్యే కార్ల సంఖ్య తప్పకుండా పెరిగే అవకాశం ఉంటుంది. 

ఇదీ చదవండి: గూగుల్ ప్లేస్టోర్ నుంచి 22 యాప్స్ అవుట్.. ఇవి మీ మొబైల్లో ఉన్నాయా?

క్రాష్ టెస్టులో కారు పనితీరు ఆధారంగా అడల్ట్ ఆక్యుపెంట్స్ అండ్ చైల్డ్ ఆక్యుపెంట్ పరీక్షించి రేటింగ్ అనేది అందివ్వడం జరుగుతుంది. అంటే కారు యువకులకు, పిల్లలకు ఏ విధమైన రక్షణ అందిస్తాయనేది ఇందులో స్పష్టంగా తెలుస్తుంది. రేపు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం భారత్‌లో సేఫ్టీ సెన్సిటివ్ కార్ మార్కెట్‌ను అభివృద్ధి చేస్తుందని భావిస్తున్నారు.

భారత్ ఎన్‌సీఏపీ కార్యక్రమానికి మారుతీ సుజుకి, మహీంద్రా & మహీంద్రా, టయోటా వంటి వాహన తయారీ దారులు ఇప్పటికే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేశాయి. ఈ ప్రోగ్రామ్ ద్వారా తప్పకుండా కార్లు మరింత భద్రతా ఫీచర్స్ పొందనున్నట్లు భావిస్తున్నారు. దీంతో భారతదేశంలో ప్రమాదంలో మరణించే వారి సంఖ్య తప్పకుండా తగ్గుతుందని చెబుతున్నారు.

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)