Breaking News

వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి: సజ్జన్ జిందాల్‌తో గడ్కరీ

Published on Tue, 10/01/2024 - 17:32

కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' (Nitin Gadkari) నాగ్‌పూర్‌లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విదర్భలో పెట్టుబడులు పెట్టవలసిన అవసరాన్ని గురించి వివరించారు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు లేకపోవడం వల్ల రూ. 500 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్న పెట్టుబడిదారులు లేకపోవడాన్ని పేర్కొన్నారు.

జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియాలో 35 శాతం వాటాను కలిగి ఉన్న 'సజ్జన్ జిందాల్' ఇటీవల తన నివాసాన్ని సందర్శించినట్లు గడ్కరీ పేర్కొన్నారు. నాగ్‌పూర్‌లో ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని తాను చెప్పినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: 40 ఏళ్ల క్రితం టీసీఎస్‌లో జీతం ఎంతంటే?: ఆఫర్ లెటర్ వైరల్

వ్యాపారాలకు ప్రభుత్వ రాయితీల సమస్యను ప్రస్తావిస్తూ, పారిశ్రామికవేత్తలు కూడా కొంత ఓపికతో ఉండాలని గడ్కరీ చెప్పారు. లడ్కీ బహిన్ యోజన కోసం ప్రభుత్వం నిధులు కేటాయించాల్సి ఉన్నందున.. పెట్టుబడిదారులు తమ సబ్సిడీ చెల్లింపును అందుకోవడానికి కొంత సమయం ఎదురు చూడాల్సి ఉంటుందని అన్నారు. కాబట్టి విదర్భలోని వ్యాపారులు, తమ వ్యాపారాలను స్వతంత్రంగా చేసుకోవాలని, ప్రభుత్వాల మీదే పూర్తిగా ఆధారపడకూడదని సలహా ఇచ్చారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)