Breaking News

ప్రతీ కార్మికుడికి ఏఐ ఫలాలు

Published on Thu, 10/09/2025 - 08:45

‘మిషన్‌ డిజిటల్‌ శ్రమసేతు’ కార్యక్రమం కింద కృత్రిమ మేధ (ఏఐ) ప్రతీ కార్మికుడికి అందుబాటులో ఉండేలా తగిన కార్యాచరణను రూపొందించాలని నీతి ఆయోగ్‌ పిలుపునిచ్చింది. ‘సమ్మిళిత సామాజికాభివృద్ధికి ఏఐ’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఏఐ, బ్లాక్‌చైన్, ఇమ్మర్సివ్‌ లెర్నింగ్‌(వీఆర్, ఏఆర్‌ సాధనాల సాయంతో), ఇతర టెక్నాలజీల ద్వారా.. ఆర్థిక అభద్రత, పరిమిత మార్కెట్‌ అవకాకాశాలు, నైపుణ్యాలలేమి వంటి వాటిని అధిగమించొచ్చని పేర్కొంది.

అసంఘటిత రంగ కార్మికులు పరికరాలు, ప్లాట్‌ఫామ్‌ల సాయంతో తమ నైపుణ్యాలు పెంచుకునేందుకు, అధిక ఉత్పాదకతకు మిషన్‌ డిజిటల్‌ శ్రమసేతు వీలు కల్పిస్తుందని తెలిపింది. ఈ కార్యక్రమం ప్రభుత్వం, విద్యా సంస్థలు, పౌర సమాజం మధ్య సహకారాన్ని పెంచుతుందని వివరించింది. తద్వారా లక్షలాది మందిని దేశ అభివృద్ధి పథకంలో భాగస్వాములను చేయడం ద్వారా 2047 నాటికి వికసిత్‌ భారత్‌ ఆకాంక్షను సాధించడం సాధ్యపడుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది.

ప్రస్తుత మాదిరే కొనసాగితే అసంఘటిత రంగంలో ప్రతీ కార్మికుడి వార్షిక ఆదాయం 2047 నాటికి 6,000 డాలర్లకు మించకపోవచ్చని, 14,500 డాలర్ల లక్ష్యానికి ఇది ఎంతో తక్కువని పేర్కొంది. కనుక దేశ అభివృద్ధికి లక్షలాది మంది దూరంగా ఉండకుండా వెంటనే సమిష్టి చర్యలు అవసరమని నివేదికలో సూచించింది. ‘దేశంలోని 49 కోట్ల అసంఘటిత రంగ కార్మికుల జీవితాల్లో మార్పులు తీసుకురావడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునేట్టు అయితే సహకారం అన్నది తప్పనిసరి’ అని నీతి ఆయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రమణియన్‌ తెలిపారు.

ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు..

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)