Breaking News

సీనియర్‌ సిటిజన్ల ప్రయోజనాలకు పెద్దపీట

Published on Tue, 02/20/2024 - 05:07

న్యూఢిల్లీ: భారతదేశంలో పన్ను సంస్కరణలతో పాటు, సీనియర్‌ సిటిజన్లకు  తప్పనిసరి పొదుపు, గృహనిర్మాణ ప్రణాళిక అవసరమని నీతి ఆయోగ్‌ స్పష్టం చేసింది. దేశ జనభాలో 2050 నాటికి సీనియర్‌ సిటిజన్ల వాటా 19.5 శాతానికి చేరుకుంటుందని, ఈ నేపథ్యంలో వారి ప్రయోజనాలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించింది.  భారతదేశంలో సీనియర్‌ సిటిజన్ల భద్రత– సంస్కరణలు అనే అంశంపై ఒక నివేదికను ఆవిష్కరించిన నీతి ఆయోగ్, సీనియర్‌ సిటిజన్‌లకు అన్ని సేవలను సులువుగా అందుబాటులోకి తీసుకురావడానికి ఒక జాతీయ పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని స్పష్టం చేసింది.

‘‘భారత్‌లో సామాజిక భద్రతా విధాన చర్యలు పరిమితంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చాలా మంది వృద్ధులు వారి పొదుపు నుండి వచ్చే ఆదాయంపై ఆధారపడతారు. కొన్ని సందర్భాల్లో నెలకొనే తక్కువ  వడ్డీ రేట్ల వ్యవస్థ వారి ఆదాయ  కోతకు దారితీస్తుంది.  కొన్నిసార్లు ఈ వడ్డీరేట్లు జీవనోపాధి స్థాయిల కంటే కూడా తక్కువగా ఉంటాయి’’ అని నివేదిక వివరించింది. అందువల్ల ఆయా అంశాల పరిశీలనకు, సీనియర్‌ సిటిజన్ల ప్రయోజనాల పరిరక్షణకు ఒక నియంత్రణా యంత్రాంగం అవసరమని ఉద్ఘాటించింది.

వృద్ధ మహిళలకు మరింత రాయితీ ఇవ్వడం అవసరమని, అది వారి ఆరి్థక శ్రేయస్సుకు దోహదం చేస్తుందని నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం భారతదేశంలో వృద్ధులు ప్రస్తుతం జనాభాలో 10 శాతానికి పైగా (10 కోట్లకు పైగా) ఉన్నారు. 2050 నాటికి మొత్తం జనాభాలో ఇది 19.5 శాతానికి చేరుతుందని అంచనా.  సీనియర్‌ సిటిజన్ల ప్రయోజనాలకుగాను పన్ను సంస్కరణలు, దత్తత వ్యవస్థ నిబంధనావళి సరళీకరణ అవసరమని కూడా నీతి ఆయోగ్‌ నివేదిక ఉద్ఘాటించింది. భారతదేశంలో 75 శాతం కంటే ఎక్కువ మంది వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని వివరించింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)