Breaking News

4,800 మంది బాధితులు.. ఆ ఐటీ కంపెనీపై చర్యలు తీసుకోండి

Published on Sun, 06/30/2024 - 09:01

ఐటీ కంపెనీ డీఎక్స్‌సీ టెక్నాలజీపై ఐటీ ఉద్యోగుల యూనియన్‌ కార్మిక శాఖకు ఫిర్యాదు చేసింది. 4,800 మందికి పైగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ను ఆన్‌బోర్డ్ చేయడంలో జాప్యం చేసిన డీఎక్స్‌సీ టెక్నాలజీపై చర్యలు తీసుకోవాలని పుణెకు చెందిన ఐటీ ప్రొఫెషనల్ యూనియన్ నాన్యూసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను కోరింది.

రెండేళ్లకు పైగా కొనసాగిన ఈ జాప్యం ఫ్రెషర్లకు తీవ్ర ఇబ్బందులను కలిగించిందని ఎన్ఐటీఈఎస్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా ఒక ప్రకటనలో తెలిపారు. కంపెనీ హామీలను నమ్మిన ఫ్రెషర్లలో చాలా మంది ఇతర ఉద్యోగ ఆఫర్లను తిరస్కరించారని యూనియన్ తెలిపింది. ప్రస్తుతం ఈ అభ్యర్థులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, ఇంకా ఉద్యోగంలోకి చేర్చుకోకపోవడంతో భవిష్యత్తుపై స్పష్టత లేదని యూనియన్‌ పేర్కొంది.

ఆన్‌బోర్డింగ్‌ జాప్యంపై ఐటీ ఎంప్లాయీస్‌ గతంలోనూ పలు కంపెనీలపై కార్మికశాఖకు ఫిర్యాదు చేసింది. 2,000 మందికి పైగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్లను ఆన్‌బోర్డ్ చేయడంలో పదేపదే జాప్యం చేస్తోందంటూ ఇన్ఫోసిస్‌పై దర్యాప్తు జరపాలని గత జూన్‌ నెల ప్రారంభంలో కోరింది. అంతకు ముందు 2023 జూలైలో టీసీఎస్ 200 మందికి పైగా లేటరల్ రిక్రూట్మెంట్లను ఆలస్యం చేస్తోందని కార్మిక శాఖకు యూనియన్ ఫిర్యాదు చేసింది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)