ఈ ఫోటో ఎవరిదో గుర్తు పట్టగలరా? టాప్‌ హీరోయిన్‌ అయితే కాదు!

Published on Thu, 06/22/2023 - 12:38

ఆసియా బిలియనీర్, వ్యాపారవేత్త ముఖేష్‌ అంబానీ భార్య, నీతా అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అటు హుందాతనానికి, అటు ఫ్యాషన్‌కి ఐకాన్‌గా ఉంటారు. వ్యాపారవేత్తగా, నృత్యకారిణిగా, పరోపకారిగా అన్నింటికీ మించి తల్లిగా నీతా అంబానీ ప్రత్యేక ఆదరణను సొంతం చేసుకున్నారు. అన్ని  విషయాల్లోనూ  భర్త అంబానీతో  ధీటుగా తనను తాను  నిరూపించుకున్న సక్సెస్‌ఫుల్‌ ఉమన్‌ నీతా. 

మధ్యతరగతి గుజరాతీ కుటుంబంలో జన్మించిన నీతా చిన్నప్పటినుంచి భరతనాట్యంలో  ప్రతిభావంతురాలైన  కళాకారిణి రాణిస్తున్నారు. శాస్త్రీయ నృత్యంలో ఇప్పటికే తన ప్రతిభను చాటుకుంటూనే ఉన్నారు. పలు కుటుంబ వేడకుల సందర్బంగా డాన్స్‌తో  ఆకట్టుకోవడం ఆమె స్టయిల్‌.  తాజాగా నీతా అంబానీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రదర్శన ఇస్తున్న ఫోటో ఒకటి ఇపుడు నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

నీతా అంబానీ భరతనాట్యం  చేస్తున్న చిన్ననాటి చిత్రాలు చూస్తే అద్భుతం అనిపించకమానదు. సాంప్రదాయ దుస్తులు ధరించి నాట్యం చేస్తున్న ఫోటో  స్పెషల్‌గా ఉంది.  తన రెండు చేతులను తన నడుముపై ఉంచి సూపర్ క్యూట్‌గా  ఉన్నారంటూ ఫ్యాన్స్‌ కమెంట్‌ చేశారు. అలాగే మరో రెండు ఫోటోల్లో  నీతా భారీ నటరాజ్ విగ్రహం ముందు పవర్ ప్యాక్ ప్రదర్శన   కళ్లు తిప్పుకోలేని ఎక్స్‌ప్రెషన్స్ అమూల్యమైన ఫ్రేమ్‌లో అందంగా ఇమిడిపోయిన ఫోటోలు విశేషంగా నిలుస్తున్నాయి.

నీతా నర్సీ మోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత,  టీచర్‌గా రూ. నెలకు 800 సంపాదించే వారట.  ఆ తరువాత ముఖేష్‌ అంబానీని పెళ్లి చేసుకుని అతిపెద్ద  కుటుంబ వ్యాపారంలో చేరారు. రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్‌పర్సన్ , ఐపీఎల్‌ క్రికెట్ జట్టు ముంబై ఇండియన్స్ యజమానిగా ఉన్నారు.అంతేకాదు  కళారంగానికి సేవాలనే ఉద్దేశంతో ముంబైలో నీతా ముఖేష్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌ను ఇటీవల లాంచ్‌ చేసినసంగతి తెలిసిందే.

Videos

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

హిమాలయాలు కరుగుతున్నాయ్!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Photos

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)