Breaking News

ఇషా అంబానీకి కొత్త బాధ్యతలు: కుమార్తెపై నీతా నమ్మకం అలాంటిది!

Published on Wed, 09/06/2023 - 15:03

 Isha Ambani రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె, రిలయన్స్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్‌ ఇషా అంబానీ మరో కీలకమైన పదవికి ఎంపికైనారు. అంబానీ భార్య , రిలయన్స్ ఫౌండేషన్  ఫౌండర్‌, ఛైర్‌ పర్సన్‌ నీతా అంబానీ ఈ విషయంలో కీలక  నిర్ణయం తీసుకున్నారు. విద్య, కళలు, క్రీడలు పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తూ, అనేక  సామాజిక కార్యకలాపాలను నిర్వించే నీతా తన ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్‌ను మరింత విస్తరించనున్నారు. ఈ నేపథ్యంలోనే తన కొత్త వెంచర్‌ బాధ్యతలను  కుమార్తె ఇషాకు అప్పగించారు.  

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) 46వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) నీతా అంబానీ , నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్ ద్వారా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇషా అంబానీ  నేతృత్వంలో   ఈ పాఠశాల భారతీయ ఆత్మతో భవిష్యత్తులో ఒక మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దనున్నట్టు కూడా వెల్లడించారు. రిలయన్స్ ఫౌండేషన్ రాబోయే 10 సంవత్సరాలలో రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ , పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌ల ద్వారా 50వేల మంది విద్యార్థులకు మద్దతు ఇవ్వనున్నామని, ఈ సంవత్సరంలోనే, సంస్థ 5000 స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేశామని కూడా  తెలిపారు.

రిలయన్స్‌ రీటైల్‌ హెడ్‌గా దూసుకుపోతున్న ఇషా అంబానీ  ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌కి వైస్ చైర్‌పర్సన్ కూడా. ఇపుడిక  నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్ బాధ్యతలను చేపట్టానున్నారు. అలాగే రిలయన్స్‌ రీటైల్‌కు సంబంధించి ఇప్పటికే పలు విదేశీ రిటైల్ బ్రాండ్‌లతో  కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)