Breaking News

అస్సాం ప్రజలకు అండగా నీతా అంబానీ: రూ.21 కోట్ల విరాళం!

Published on Mon, 08/03/2026 - 19:11

అస్సాంలో భారీ వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు.. రిలయన్స్ ఫౌండేషన్ అండగా నిలిచింది. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీ అస్సాం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.21 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.

వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబం పట్ల తనకు ఎంతో బాధ ఉందని, అస్సాం ప్రజలు ఒంటరిగా లేరని నీతా అంబానీ భరోసా ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతున్న రిలయన్స్ సహాయక చర్యలకు అదనంగా ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.

రిలయన్స్ ఫౌండేషన్ బృందాలు అస్సాంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సహాయక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ముఖ్యంగా శివసాగర్, చరైడియో జిల్లాల్లో అవసరమైన కుటుంబాలకు ఆహారం, తాగునీరు, ఆరోగ్య సేవలు, అత్యవసర వసతి వంటి సహాయాన్ని అందిస్తున్నారు. వాటర్ ప్యూరిఫికేషన్ యూనిట్ల ఏర్పాటు, ఆరోగ్య కేంద్రాల పునరుద్ధరణ, కమ్యూనిటీ కిచెన్ల నిర్వహణతో పాటు వంటరా బృందాల ద్వారా పశువులకు వైద్య సహాయం కూడా అందిస్తున్నారు.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ.. నీతా అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ సేవలను ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో ఎప్పుడూ అండగా నిలుస్తున్న రిలయన్స్ సహాయం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోందని అన్నారు.

వరదల సమయంలో మనుషులతో పాటు పశువులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రిలయన్స్‌కు చెందిన వంటరా (Vantara) బృందాలు గ్రామాల్లో పశువుల కోసం వైద్య సహాయం, సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. స్థానిక అధికారులు, గ్రామ ప్రజలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన ప్రాంతాలకు సహాయాన్ని చేరవేస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమాల ద్వారా వేలాది మంది ప్రజలు ప్రయోజనం పొందారని రిలయన్స్ ఫౌండేషన్ తెలిపింది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)