Breaking News

స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ ఇంజన్‌తో టెక్టన్.. ధర, ఫీచర్లు ఇవే!

Published on Thu, 07/09/2026 - 14:48

నిస్సాన్ ఇండియా.. భారత మార్కెట్లో మిడ్ సైజ్ ఎస్‌యూవీ విభాగంలోకి ప్రవేశిస్తూ, 'టెక్టన్‌'ను అధికారికంగా లాంచ్ చేసింది. దీని ధరలు రూ.10.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. కంపెనీ ఇప్పుడు బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నాయి.

టెక్టన్ డిజైన్
నిస్సాన్ టెక్టన్ కారు లేటెస్ట్ డిజైన్ పొందుతుంది. ఈ ఎస్‌యూవీ ముందు భాగంలో వెడల్పాటి గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్, సీ షేప్ డీఆర్ఎల్స్ ఉన్నాయి. బోనెట్‌పై టెక్టన్ అనే అక్షరాలు ఉండటం గమనించవచ్చు. పెద్ద వీల్ ఆర్చ్‌లు, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, ముందు డోర్ల కోసం పుల్ స్టైల్ హ్యాండిల్స్ ఉన్నాయి. వెనుక భాగంలో టెయిల్‌ల్యాంప్‌లకు ఒక ప్రత్యేకమైన డిజైన్‌ కలిగి ఉంది. ఈ కారు టెయిల్‌గేట్‌పై బ్రాండ్ బ్యాడ్జ్‌ను చూడవచ్చు. ఇది ఆరు మోనోటోన్‌లు, ఐదు డ్యూయల్ టోన్‌లతో సహా 11 పెయింట్ స్కీమ్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

ఇంటీరియర్, ఫీచర్స్
నిస్సాన్ టెక్టన్ క్యాబిన్‌ డ్యూయల్ టోన్ అపోల్స్ట్రే పాటు నాలుగు ఇంటీరియర్ థీమ్‌ల ఎంపికలను పొందుతుంది. 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 10.25 అంగుళాల ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటితో పాటు వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ ఏసీ కంట్రోల్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, గూగుల్ మ్యాప్స్‌తో కూడిన గూగుల్ బిల్ట్-ఇన్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ప్యాడిల్ షిఫ్టర్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, స్మార్ట్ పవర్డ్ టెయిల్‌గేట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటివి కూడా లభిస్తాయి.

సేఫ్టీ ఫీచర్స్
సేఫ్టీ విషయానికి వస్తే.. ఈ ఎస్‌యూవీ 5 స్టార్ BNCAP రేటింగ్‌ను పొందింది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ISOFIX మౌంట్‌లు, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, హిల్ హోల్డ్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. భద్రతా ప్రమాణాలను మరింత పెంచడానికి.. నిస్సాన్ కంపెనీ ఈ ఎస్‌యూవీ లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్ వంటి ఏడీఏఎస్ ఫీచర్లను కూడా అందిస్తోంది.

పవర్‌ట్రెయిన్, మైలేజ్
ఇక పవర్‌ట్రెయిన్, మైలేజ్ విషయానికి వస్తే.. ఇందులోని 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 100 హార్స్ పవర్ 166 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఎంపిక కూడా అందుబాటులో ఉంటుంది. ఇది 163 hp పవర్, 280 న్యూటన్ మీటర్ టార్క్‌ అందిస్తుంది. ట్రాన్స్‌మిషన్ల జాబితాలో 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ DCT (ప్రత్యేకంగా 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కోసం) ఉన్నాయి. చిన్న ఇంజన్ 19.4 kmpl మైలేజ్ అందించగా, పెద్ద యూనిట్ 18.5 kmpl మైలేజ్ అందిస్తుంది.

నిస్సాన్ టెక్టన్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ విభాగంలోని రెనాల్ట్ డస్టర్, టాటా సియెర్రా, మారుతి సుజుకి విక్టోరిస్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్ వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాలి వస్తుంది.

కొత్త అధ్యాయానికి నాంది పలికిన నిస్సాన్
''ఆటోమొబైల్ రంగంలో మరో కొత్త అధ్యాయానికి నాంది పలికిన నిస్సాన్ ఇండియాకు అభినందనలు. ప్రపంచ వేదికపై ఆల్-న్యూ నిస్సాన్ టెక్టన్‌ను ఆవిష్కరించడం విశేషమైన ఘట్టం. ఆకట్టుకునే డిజైన్, ఆధునిక సాంకేతికత, అత్యుత్తమ ఫీచర్లతో రూపొందిన ఈ ఎస్‌యూవీ నిస్సాన్ నాణ్యతకు మరో నిదర్శనంగా నిలుస్తోంది. ఈ అద్భుతమైన మైలురాయిని సాధించిన నిస్సాన్ ఇండియా బృందానికి శుభాకాంక్షలు. భారత మార్కెట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా టెక్టన్ విశేష విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము'' అని కంపెనీ ప్రతినిధులు నిస్సాన్ టెక్టన్ లాంచ్ సందర్భంగా వెల్లడించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)