Breaking News

దాదాపు లక్ష.. కార్ల విక్రయాల రికార్డ్‌

Published on Wed, 04/30/2025 - 20:13

ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ మోటార్ ఇండియా 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక వార్షిక విక్రయాలను నమోదు చేసింది. 99,000 యూనిట్‌లకు పైగా విక్రయించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి ఏడేళ్లలో కంపెనీకి ఇవే అత్యధిక వార్షిక విక్రయాలు. న్యూ నిస్సాన్ మాగ్నైట్ బీ-ఎస్‌యూవీ బలమైన పనితీరుతో 35 శాతం వృద్ధిని సాధించింది.

దేశీయంగా 28,000 యూనిట్లు, ఎగుమతుల్లో 71,000 యూనిట్లతో, నిస్సాన్ తన “ఒక కారు, ఒక ప్రపంచం” విధానంతో 65కు పైగా అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించింది.  2024 అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన న్యూ మాగ్నైట్ 1.5 లక్షల విక్రయాలు, 50,000 ఎగుమతి యూనిట్లను దాటింది. సౌదీ అరేబియాలో తొలి ఎల్‌హెచ్‌డీ మార్కెట్‌గా అడుగుపెట్టింది.

నిస్సాన్ 25 ఆర్థిక సంవత్సరంలో 7-సీటర్ బీ-ఎంపీవీ, 26 ఆర్థిక సంవత్సరంలో 5-సీటర్ సీ-ఎస్‌యూవీని ప్రవేశపెట్టనుంది. గ్లోబల్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా చెన్నై జేవీ ప్లాంట్‌లో వాటాను అలయన్స్ భాగస్వామికి అప్పగించినప్పటికీ, భారత్‌లో నిస్సాన్ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. భారత్‌లో వృద్ధి స్థిరంగా ఉందని, భవిష్యత్ ఉత్పత్తుల పైప్‌లైన్ అలాగే ఉంటుందని నిస్సాన్ ఇండియా అధ్యక్షుడు ఫ్రాంక్ టోరెస్ తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)