Breaking News

నిర్మలా సీతారామన్‌ మరో రికార్డు,  ఎక్కువగా వాడిన పదాలు ఏంటో తెలుసా?

Published on Wed, 02/01/2023 - 14:56

న్యూఢిల్లీ:  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్‌ను  ఫిబ్రవరి 1న  ప్రెజెంటేషన్‌ సందర్భంగా ఆమె మరో రికార్డు క్రియేట్‌ చేశారు.  వరుసగా ఐదోసారి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన ఆమె ఈ సారి బడ్జెట్‌ను ‍ కేవలం 87 నిమిషాల్లో (గంటా 27 నిమిషాల్లో) ముగించారు. తద్వారా అతి తక్కువ సమయం బడ్జెట్‌ ప్రసంగం చేసిన రికార్డును క్రియేట్‌ చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం 2023-24 బడ్జెట్‌ను దాదాపు 16236 పదాలతో అతి చిన్న బడ్జెట్ ప్రసంగం  చేశారు. సాధారణంగా కనీసం 2 గంటల పాటు జరిగే బడ్జెట్ ప్రసంగాలలో ఇది అతి చిన్నది. 

భారతదేశ చరిత్రలో  అతి ఎక్కువ ,తక్కువ బడ్జెట్ ప్రసంగాలు
 ►ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  2020 బడ్జెట్ ప్రసంగంలో 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇది బడ్జెట్ ప్రసంగాల చరిత్రలో సుదీర్ఘమైనది.  వ్యవధి పరంగా సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డును సీతారామన్ సొంతం చేసుకున్నారు. 

► భారత తొలి (పూర్తి) మహిళా ఆర్థిక మంత్రి సీతారామన్, 2019లో తన తొలి బడ్జెట్ ప్రసంగంలో, 2 గంటల 17 నిమిషాలు మాట్లాడారు. ఇంకా రెండు పేజీలు మిగిలి ఉన్నప్పటికీ, అస్వస్థతకు గురై తన ప్రసంగాన్ని కుదించుకుని  ప్రసంగంలో మిగిలిన భాగాన్ని చదివినట్లుగా పరిగణించాలని ఆమె స్పీకర్‌ను కోరారు.

►ఆ తరువాత  ఫిబ్రవరి 1, 2020న 2020-21 కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించి తన రికార్డును తానే  బద్దలు కొట్టారు.  2021లో ఆమె గంటా 50 నిమిషాల పాటు ప్రసంగించారు.
►ఇ​క మాజీ ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ తన 2003 బడ్జెట్ ప్రసంగంలో 2 గంటల 13 నిమిషాల పాటు ప్రసంగించారు.
►మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన 2014 బడ్జెట్ ప్రసంగంలో 2 గంటల 10 నిమిషాల పాటు ప్రసంగించారు.
► పదాల గణన పరంగా, 1991లో మన్మోహన్ సింగ్ సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేశారు. ప్రసంగంలో 18,650 పదాలు ఉన్నాయి.

కాగా రానున్న ఎ న్నికలు, మోదీ సర్కార్‌కు చివరి బడ్జెట్‌ కావడంతో   పన్ను చెల్లింపు దారులకు భారీ ఊరట కల్పించారు. అలాగే వేతన జీవుల ఆదాయ పన్నుల ట్యాక్స్‌ ‍శ్లాబ్స్‌లో మార్పులు తీసుకొచ్చారు. పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగంలో పన్ను, అభివృద్ధి, రాష్ట్రాలు, ఆదాయం , ఆర్థిక పదాలు ఎక్కువగా ఉపయోగించగా.  పన్ను అనే పదాన్ని  ఎక్కువగా 51 సార్లు, అభివృద్ధి 28 సార్లు, రాష్ట్రాలు 27 సార్లు, ఆదాయం 26 సార్లు, ఫైనాన్స్ అనే పదాన్ని 25 సార్లు ఉపయోగించారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు అయిన నేపథ్యంలో అన్ని వర్గాల అభివృద్ధికి దోహదపడే అమృత్‌కాల్‌ బడ్జెట్‌ అనే పదాన్ని కూడా ఎక్కువగానే ప్రస్తావించారు. 

Videos

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)