Breaking News

క్రిప్టో తరహా ఆర్థిక ఉత్పత్తులతో సవాళ్లు

Published on Wed, 12/03/2025 - 09:22

ఆర్థిక వ్యవస్థలు డిజటల్‌గా మారుతుండడం, క్రిప్టో, స్టెబుల్‌ కాయిన్లు తరహా కొత్త ఆర్థిక ఉత్పత్తులు పుట్టుకొస్తుండడంతో.. వీటి కారణంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాల మధ్య సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

లబ్ధిదారుల వివరాలు, పన్నుల సమాచారాన్ని సకాలంలో పంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఇందుకోసం కృత్రిమ మేథ (ఏఐ) వంటి సాధనాలను వినియోగించుకోవాలని, దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమన్నారు. ఇందుకు వీలుగా అంతర్జాతీయ ఫోరమ్‌ కోసం మంత్రి సీతారామన్‌ పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రమాణాలను మరింత బలోపేతం చేయడంతోపాటు పంచుకున్న సమాచారం ఆధారంగా ఫలితాలు సాధించేందుకు ఇది అవసరమని అభిప్రాయపడ్డారు.

ఢిల్లీలో మంగళవారం 18వ గ్లోబల్‌ ఫోరమ్‌ ప్లీనరీ సమావేశాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి సీతారామన్‌ మాట్లాడారు. ఏ ఒక్క దేశం తనంతట తాను ఈ సవాళ్లను పరిష్కరించలేదన్నారు. సహకారం, విశ్వాసం, సకాలంలో సరైన సమాచారం పంచుకోవడం అవసమరన్నారు. స్పష్టమైన నిబంధనల మేరకు నడుచుకుంటే పన్నుల్లో పారదర్శకత, కచ్చితత్వం ఉంటుందన్నారు.

గడిచిన దశాబ్ద కాలంలో దేశంలో స్వచ్చంద నిబంధనల అమలు మెరుగుపడినట్టు మంత్రి చెప్పారు. సకాలంలో సమాచారాన్ని గుర్తించేందుకు ఏఐ తరహా టెక్నాలజీలు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. ఆవిష్కరణలు అన్నవి జవాబుదారీగా ఉండాలంటూ.. ఇవి వ్యవస్థలకు బలాన్ని, విశ్వసనీయతను తెచ్చిపెట్టే విధంగా ఉండాలన్నారు.  

రహస్య సమాచారం.. 
డేటా గోప్యతకు సంబంధించి బలమైన వ్యవస్థల దిశగా దేశాలు కలసి పనిచేయాలని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అరవింద్‌ శ్రీవాస్తవ పిలుపునిచ్చాన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పంచుకునే సమాచారాన్ని సమర్థవంతంగా వినియోగించు కోవాలన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)