Breaking News

అంతర్జాతీయ సవాళ్లపై సమాలోచనలు...

Published on Thu, 10/12/2023 - 02:33

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మొరాకో ఆర్థిక రాజధాని మారకేచ్‌లో ప్రపంచ ఆర్థిక విధాన నిర్ణేతలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పలు అంతర్జాతీయ ఆర్థిక అంశాలు, సవాళ్లు, వీటిని ఎదుర్కొనడం.. ఆమె చర్చల్లో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్‌ బ్యాంకుల గవర్నర్‌ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్‌–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సంస్థ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఈ నెల 11న మారకేచ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.

ఈ సమావేశాల్లో భాగంగా ఆమె 15వ తేదీ వరకూ మరకేచ్‌లోనే ఇండోనేషియా, మొరాకో, బ్రెజిల్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్‌లతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ సమస్యలు, సవాళ్లు, ఆర్థిక అనిశి్చతి, బహుళజాతి బ్యాంకుల పటిష్టత, క్రిప్టో కరెన్సీ వంటి అంశాలు ఈ సమావేశాల చర్చల్లో ప్రధాన భాగంగా ఉన్నాయి. సమావేశాల్లో భాగంగా అమెరికా ఆర్థికమంత్రి జనెత్‌ ఎలన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భవిష్యత్‌ సవాళ్లను ఎదుర్కొనడానికి ఐఎంఎఫ్‌కు నిధుల లభ్యతపై ప్రధానంగా చర్చ జరిగింది.

ఐఎంఎఫ్‌ రుణ విధానాలు, పటిష్టత, కోటా విధానం, పేదరిక నిర్మూలన, ఐఎంఎఫ్‌ పాలనా నిర్వహణ విషయంలో సంస్కరణలపై ఆర్థికమంత్రి ప్రధానంగా చర్చించినట్లు ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కే జార్జివా నేతృత్వంలోని బృందంతోపాటు,  ఇంటర్‌–అమెరికన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ ఇలాన్‌ గోల్డ్‌ఫాజ్‌్నతో కూడా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సమావేశమయ్యారు.  జీ20 ఎజెండాను కొనసాగించేందుకు ఐఎంఎఫ్‌తో కలిసి పనిచేయాలన్న భారత్‌ ఆకాంక్షను ఆమె ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌తో జరిగిన సమావేశాల్లో వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.  
 

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు