Breaking News

NHAI: ఉచితంగా రూ.1000 ఫాస్ట్‌ట్యాగ్‌ రీఛార్జ్!

Published on Fri, 02/13/2026 - 18:30

జాతీయ రహదారులపై ప్రయాణించే.. ప్రయాణికులకు మరింత సౌకర్యం & పరిశుభ్రత కల్పించాలనే లక్ష్యంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఓ కొత్త కార్యక్రమం ప్రారంభించింది. దీని ద్వారా రూ. 1000 విలువైన ఫాస్ట్‌ట్యాగ్‌ రీచార్జ్ ఉచితంగా పొందవచ్చని ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎన్‌హెచ్‌ఏఐ 'క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్' పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం 2026 జూన్ 30 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశ్యం ఏమిటంటే.. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలలోని మరుగుదొడ్ల పరిశుభ్రతను మెరుగుపరచడం.

జాతీయ రహదారులపై ప్రయాణించే వారిలో చాలామంది.. టోల్ ప్లాజాలలో ఉన్న మరుగుదొడ్లను ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల పరిశుభ్రత లోపించడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎన్‌హెచ్‌ఏఐ ప్రజల సహకారం కోరుతోంది. కాబట్టి ఎవరైనా.. టోల్ ప్లాజాలలో మరుగుదొడ్డి అపరిశుభ్రంగా ఉందని గమనిస్తే.. ఫోటో తీసి రాజ్‌మార్గయాత్ర యాప్ లేటెస్ట్ వెర్షన్ ద్వారా జియో-ట్యాగ్ చేసిన ఫోటోలను పేరు, ప్రదేశం, వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ (VRN) & మొబైల్ నంబర్‌తో సహా వివరాలతో అప్‌లోడ్ చేయాలి.

సంబంధిత అధికారులు ఫోటోలను పరిశీలించి.. సమాచారం నిజమని ద్రువీకరిస్తే, ఫోటోలను షేర్ చేసిన వారి వెహికల్ నెంబర్‌కు రూ. 1000 విలువైన ఫాస్ట్‌ట్యాగ్‌ రీఛార్జ్ బహుమతిగా లభిస్తుంది. ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని.. రహదారులపై పరిశుభ్రతను మెరుగుపరచడానికి సహకరిస్తారని ఎన్‌హెచ్‌ఏఐ భావిస్తోంది.

#

Tags : 1

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)