Breaking News

జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్ బోర్డులు: ఎందుకంటే?

Published on Sat, 10/04/2025 - 15:58

జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్ (QR Code) ఏర్పాటు చేయడానికి.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సన్నద్ధమవుతోంది. ఇంతకీ ఈ క్యూఆర్ కోడ్ ఎందుకు?, దీనివల్ల వాహనదారులకు ఉపయోగం ఏమిటి? అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

ప్రయాణీకులకు అవసరమైన సమాచారాన్ని తక్షణమే పొందేలా చేయడానికి.. ఎన్‌హెచ్‌ఏఐ జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్‌లతో కూడిన సైన్‌బోర్డులను ఏర్పాటు చేయనుంది. రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ పత్రికా ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.

జాతీయ రహదారులపై ఏర్పాటు చేయనున్న క్యూఆర్ కోడ్ సైన్ బోర్డులు.. వాహనదారులకు చాలా సౌలభ్యంగా ఉంటాయి. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా.. నేషనల్ హైవేల సంఖ్య, చైనేజ్, ప్రాజెక్ట్ పొడవును సంబంధించిన వివరాలతో పాటు.. 1033తో సహా ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్‌లను తెలుసుకోవచ్చు. టోల్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, రెసిడెంట్ ఇంజనీర్, ఎన్‌హెచ్‌ఏఐ ఫీల్డ్ ఆఫీసులు వంటి కీలక అధికారుల సంప్రదింపు వివరాలను కూడా పొందవచ్చు.

క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా.. హాస్పిటల్స్, పెట్రోల్ పంపులు, టాయిలెట్లు, పోలీస్ స్టేషన్లు, రెస్టారెంట్లు, వెహికల్ రిపేర్ షాప్స్, టోల్ ప్లాజాలు, ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లు వంటి సమీపంలోని అత్యవసర సేవలకు గురించి కూడా తెలుసుకోవచ్చు. రహదారి భద్రతను మెరుగుపరచడంతో పాటు.. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు అవసరమైన సేవలను గుర్తించడంలో సహాయపడటం ఈ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం.

ఇదీ చదవండి: కొత్త రూల్.. ఎలక్ట్రిక్ వాహనాలకు సౌండ్ తప్పనిసరి!

జాతీయ రహదారులపై ఈ క్యూఆర్ సైన్‌బోర్డులను.. రోడ్ స్టార్టింగ్, ఎండింగ్ పాయింట్ల వద్ద మాత్రమే కాకుండా, టోల్ ప్లాజాల దగ్గర, రోడ్డుపక్కన కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది. ఈ క్యూఆర్ కోడ్స్ రహదారి భద్రతను మెరుగుపరచడంలో సహాయపడటమే కాకుండా.. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల గురించి వినియోగదారు అనుభవాన్ని, అవగాహనను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

#

Tags : 1

Videos

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)