Breaking News

ఇన్వెస్టర్లూ.. ఇవిగో కొత్త ఫండ్‌లు

Published on Mon, 09/15/2025 - 19:09

వివిధ మార్కెట్‌క్యాప్‌లవ్యాప్తంగా ఇన్వెస్ట్‌ చేసే ‘ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌’ను ది వెల్త్‌ కంపెనీ మ్యూచువల్‌ ఫండ్‌ ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో) సెప్టెంబర్‌ 24న ప్రారంభమై అక్టోబర్‌ 8న ముగుస్తుంది. ఇది తమ తొలి ఫండ్‌ అని సంస్థ ఎండీ మధు లూనావత్‌ తెలిపారు. లార్జ్, మిడ్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో ఇది ఇన్వెస్ట్‌ చేస్తుందని, నిఫ్టీ 500 టీఆర్‌ఐ దీనికి బెంచ్‌మార్క్‌గా ఉంటుందని పేర్కొన్నారు.

ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థల తరహాలో కూలంకషంగా అధ్యయనం చేసి ఫండమెంటల్స్, వేల్యుయేషన్లు, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కేటాయింపులు ఉంటాయని మధు వివరించారు. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పాంటోమత్‌ గ్రూప్‌లో ది వెల్త్‌ కంపెనీ భాగంగా ఉంది. పలు ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్‌ (ఏఐఎఫ్‌)ను కూడా నిర్వహిస్తోంది.

హెచ్‌డీఎఫ్‌సీ ‘డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఆల్‌ క్యాప్‌’ ఎఫ్‌వోఎఫ్‌ .. 
హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ తాజాగా డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఆల్‌ క్యాప్‌ యాక్టివ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌వోఎఫ్‌)ను ఆవిష్కరించింది. ఇది సెప్టెంబర్‌ 24 వరకు అందుబాటులో ఉంటుంది. వివిధ మార్కెట్‌క్యాప్‌లవ్యాప్తంగా దేశీయంగా ఈక్విటీ ఆధారిత స్కీముల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది.

పలు ఫండ్‌ మేనేజర్ల అనుభవం, వివిధ రకాల పెట్టుబడుల ధోరణులు, క్రమశిక్షణతో కూడుకున్న రీబ్యాలెన్సింగ్‌ ప్రయోజనాలన్నింటినీ ఈ ఒక్క ఫండ్‌తో పొందవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఎండీ నవ్‌నీత్‌ మునోట్‌ తెలిపారు. ఎన్‌ఎఫ్‌వో వ్యవధిలో కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు.

ఇదీ చదవండి: జియో బ్లాక్‌రాక్‌ తొలి ఫండ్‌..

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)