Breaking News

న్యూజిలాండ్‌ వీసా రూల్స్‌లో మార్పులు

Published on Fri, 06/28/2024 - 15:42

న్యూజిలాండ్‌ వీసా రూల్స్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. తమ దేశంలో కొన్ని పాత్రల్లో పనిచేస్తున్న విదేశీయులు తమ ద్వారా తమవారికి వర్క్‌, విజిటర్‌, స్టూడెంట్‌ వీసాలకు స్పాన్సర్ చేయడానికి అనుమతించని కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలను న్యూజిలాండ్ ప్రకటించింది.

వీసా స్పాన్సర్లు న్యూజిలాండ్ ఆర్థిక, ఇమ్మిగ్రేషన్ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్దిష్ట ప్రమాణాలను చేరుకునేలా వీసా ప్రక్రియలను క్రమబద్ధీకరించడమే ఈ నిబంధనల లక్ష్యం. వీటి ప్రకారం జూన్ 26 నుంచి ఆస్ట్రేలియన్, న్యూజిలాండ్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్యుపేషన్స్ (ANZSCO) లెవల్స్ 4, 5 లో రెసిడెన్సీ పాత్‌వేస్‌ (వివిధ రంగాల్లో నైపుణ్యాలు) లేకుండా అక్రిడేటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసా ఉన్నవారు ఇకపై తమ భాగస్వాములు, పిల్లల కోసం వర్క్‌, విజిట్‌, స్టూడెంట్‌ వీసా దరఖాస్తులకు మద్దతు ఇవ్వలేరు.

ఈ సంవత్సరం ప్రారంభంలో ఏఈడబ్ల్యూవీ పథకానికి చేసిన విస్తృత సవరణలకు అనుగుణంగా ఈ సర్దుబాటు ఉంటుంది. అయితే భాగస్వాములు, పిల్లలు సంబంధిత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే ఎక్రిడేటర్‌ ఎంప్లాయర్ వర్క్ వీసా లేదా అంతర్జాతీయ స్టూడెంట్‌ వీసా వంటి వాటి కోసం సొంతంగా దరఖాస్తు చేసుకోవచ్చు.  ఇప్పటికే భాగస్వాములుగా లేదా డిపెండెంట్‌ పిల్లలుగా వీసాలను కలిగి ఉన్నవారిపై ఈ మార్పుతో ప్రభావం ఉండదని న్యూజిలాండ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.

#

Tags : 1

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)