Breaking News

జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన మార్పులు ఇవే..

Published on Wed, 01/01/2025 - 11:46

కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. ఈ రోజు జనవరి 1, 2025 నుంచి దేశవ్యాప్తంగా కొన్ని అంశాల్లో మార్పులు అమలు అవుతున్నాయి. ఈపీఎఫ్‌ఓ, యూఎస్‌ వీసా, ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు, కార్ల ధరలు, రేషన్‌ కార్డులకు కేవైసీ నమోదు చేయడం వంటి వాటిలో మార్పులు వచ్చాయి. ఈమేరకు ఇప్పటికే ఆయా విభాగాలు ప్రకటనలు విడుదల చేశాయి. అందులో కొన్ని ముఖ్యమైన వాటి వివరాలు తెలుసుకుందాం.

ఎల్‌పీజీ సిలిండర్ ధరలు

జనవరి 1, 2025 నుంచి ప్రధాన నగరాల్లో 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు తగ్గాయి. మారిన ధరలు కింది విధంగా ఉన్నాయి.

  • ఢిల్లీ: రూ.1,804 (రూ.14.5 తగ్గింది)

  • ముంబై: రూ.1,756 (రూ.15 తగ్గుదల)

  • కోల్‌కతా: రూ.1,911 (రూ.16 తగ్గింది)

  • చెన్నై: రూ.1,966 (రూ.14.5 తగ్గింది)

14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర స్థిరంగా ఢిల్లీలో రూ.803, కోల్‌కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50గా ఉంది.

కార్ల ధరలు

మారుతి సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా, బీఎండబ్ల్యూ(BMW) వంటి ప్రధాన ఆటో కంపెనీలు కార్ల ధరలను 3% వరకు పెంచాయి.

రేషన్ కార్డులకు ఈ-కేవైసీ

రేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ(e-KYC) తప్పనిసరి. 2024 డిసెంబర్ 31లోగా ఈ-కేవైసీ పూర్తి చేయని రేషన్‌కార్డులు రద్దవుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

పెన్షన్ ఉపసంహరణ నిబంధనలు

పెన్షనర్లు అదనంగా ఎలాంటి ధ్రువీకరణ అవసరం లేకుండా ఏదైనా బ్యాంకు నుంచి పెన్షన్‌ను ఉపసంహరించుకోవడానికి ఈపీఎఫ్‌ఓ అనుమతించింది.

ఏటీఎం ద్వారా పీఎఫ్‌ విత్‌డ్రా

సులభంగా పీఎఫ్(PF) ఖాతాలోని నగదును ఉపసంహరించుకోవడానికి ఏటీఎం కార్డు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఈపీఎఫ్‌ఓ తెలిపింది.

ఇదీ చదవండి: ఏడాది మొదటిరోజు తులం బంగారం ఎంతంటే..

యూపీఐ పరిమితి పెంపు

యూపీఐ 123పే కింద ఫీచర్ ఫోన్ యూజర్లకు చెల్లింపు పరిమితిని రూ.10,000కు కేంద్రం పెంచింది. ఇది గతంలో రూ.5,000గా ఉండేది. జనవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తున్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది.

యూఎస్ వీసా రూల్స్

నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా(Visa) దరఖాస్తుదారులు జనవరి 1 నుంచి ఒకసారి ఉచితంగా అపాయింట్‌మెంట్‌ను రీషెడ్యూల్ చేసుకోవచ్చు.
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)