Breaking News

ప్యాకేజ్డ్‌ ఉత్పత్తుల ముద్రణలో కీలక మార్పులు..

Published on Tue, 01/02/2024 - 07:23

న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్‌ ఉత్పత్తులు అన్నింటిపై ‘తయారీ తేదీ’ని, ‘యూనిట్‌ విక్రయ ధర’ను తప్పనిసరిగా ముద్రించాలన్న నిబంధన జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. ఇలాంటి ఉత్పత్తులను వేర్వేరు పరిమాణాల్లో విక్రయిస్తారు కాబట్టి ‘యూనిట్‌ విక్రయ ధర’ ఎంతనేది వినియోగదారులకు తెలియాల్సిన అవసరం ఉందని, తద్వారా వారు కొనుగోలు విషయంలో తగు నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని ఆయన పేర్కొన్నారు.

గతంలో ప్యాకేజ్డ్‌ ఉత్పత్తులపై తయారీ తేదీని లేదా దిగుమతి చేసుకున్న తేదీని లేదా ప్యాక్‌ చేసిన తేదీని ముద్రించేందుకు కంపెనీలకు వెసులుబాటు ఉండేది. దాన్ని ప్రస్తుతం మార్చారు. తయారీ తేదీని ముద్రించడం వల్ల సదరు ఉత్పత్తి ఎన్నాళ్ల క్రితం తయారైనదీ వినియోగదారులకు స్పష్టంగా తెలిసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే యూనిట్‌ ధరను ముద్రించడం వల్ల గ్రాముల లెక్కన ఖరీదు ఎంత ఉంటోందో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు 2.5 కేజీల గోధుమ పిండి ప్యాకెట్‌పై గరిష్ట చిల్లర ధరతో (ఎంఆర్‌పీ) పాటు కేజీ (యూనిట్‌) ధర ఎంత అనేది కూడా ముద్రించాల్సి ఉంటుంది. ఒకవేళ కేజీ కన్నా తక్కువ పరిమాణం ఉంటే ఎంఆర్‌పీతో పాటు గ్రాముకి ఇంతని ముద్రించాలి.  
 

#

Tags : 1

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు