Breaking News

ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు అలెర్ట్‌.. మారిన విత్‌ డ్రా నిబంధనలు

Published on Sat, 05/18/2024 - 14:37

వేతన జీవుల కోసం ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్‌ విత్‌ డ్రాయిల్‌ నిబంధనల్ని మార్చింది.ఈ నిబంధనలు ఈపీఎఫ్‌ఓ లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. ఇంతకీ ఈపీఎఫ్‌ఓలో ఎలాంటి మార్పులు చేసుకున్నాయి? వాటివల్ల ఈపీఎఫ్‌ఓ సబ్‌స్క్రైబర్లకు ఎలాంటి లాభం చేకూరనుంది?

గతంలో ఈపీఎఫ్‌ఓ సభ్యులు ఎవరైనా మరణిస్తే వారి అకౌంట్‌ నుంచి డబ్బులు డ్రా చేయాలంటే ఆధార్‌ తప్పని సరి. అయితే ఆధార్‌ లేకపోవడం, లేదంటే తప్పులు దొర్లడం వంటి పలు సందర్భాలలో ఈపీఎఫ్‌ఓ డబ్బులు విత్‌ డ్రాయిల్‌ చేయడం కష్టంగా మారింది. దీంతో సకాలంలో డబ్బులు అందక బాధిత కుటుంబ సభ్యులు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు.

ఓఐసీ అనుమతి తప్పని సరి
ఈ నేపథ్యంలో ఈపీఎఫ్‌ఓ దారులు ఎవరైనా మరణిస్తే.. ఆధార్‌ కార్డ్‌ లేకుండా పీఎఫ్‌ విత్‌ డ్రాయిల్‌ చేసుకునే వెసులుబాటు ఈపీఎఫ్‌ఓ కల్పించింది. మరణించిన ఉద్యోగి సంస్థ హెచ్‌ఆర్‌ విభాగం.. సదరు ఉద్యోగి మరణించారని నిర్ధారిస్తూ ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లో వివరాల్ని వెల్లడించాల్సి ఉంటుంది. ఆ వివరాలు సరైనవేనని నిర్ధారించిన తర్వాత ఈపీఎఫ్‌ఓ కార్యాలయం ఆఫీసర్‌ ఇన్‌ ఛార్జ్‌ (ఓఐసీ)అనుమతి ఇవ్వాలి. అనంతరం ఈపీఎఫ్‌ఓ విత్‌ డ్రాయిల్‌ ప్రాసెస్‌ ప్రారంభం అవుతుంది.

ఇది ఎవరికి వర్తిస్తుంది? 
ఈపీఎఫ్‌ఓ మే 17న అధికారికంగా విడుదల చేసిన ప్రకటన మేరకు యూఏఎన్‌లో సభ్యుని వివరాలు సరిగ్గా ఉన్నప్పటికీ ఆధార్ డేటాబేస్‌లో సరికాని/అసంపూర్ణంగా ఉన్న సందర్భాల్లో మాత్రమే పై సూచనలు వర్తిస్తాయి.

ఆధార్‌ కార్డ్‌ లేకపోతే 
మరణించిన ఈపీఎఫ్‌ఓ దారుడికి ఆధార్‌ కార్డ్‌ లేకపోతే ఈపీఎఫ్‌ఓ 26.03.2024న విడుదల చేసిన జాయింట్‌ డిక్లరేషన్‌ స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ వెర్షన్-2 ప్రకారం ఆధార్ లేని సభ్యుడు మరణిస్తే నామినీ ఆధార్ సిస్టమ్‌లో సేవ్ అవుతుంది. నామినీ సంతకం చేయడానికి అనుమతి ఉంటుంది. జాయింట్‌ డిక్లరేషన్‌ ఫారంతో పాటు ఇతర ప్రక్రియలు ఒకే విధంగా ఉంటాయని ఈపీఎఫ్‌ఓ తెలిపింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)