Breaking News

ఆర్‌బీఐ కొత్త రూల్స్‌ : హోమ్‌లోన్‌పై రూ. 33 లక్షల వరకు ఆదా

Published on Sat, 09/16/2023 - 13:10

హోమ్‌ లోన్‌ ఖాతాదారులకు ఆర్‌బీఐ శుభవార్త చెప్పింది. ఆర్‌బీఐ అమల్లోకి తేనున్న కొత్త రూల్స్‌తో ఇంటి రుణాల్లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఫలితంగా రూ.50 లక్షల హోమ్‌లోన్‌పై చెల్లించే వడ్డీ రూ.33 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని తెలుస్తోంది.  

గత ఏడాది ఆర్‌బీఐ వరుస వడ్డీ రేట్ల పెంచుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే, వడ్డీ రేటు పెరిగినప్పుడు కస్టమర్లు నెలవారీ చెల్లించే ఈక్వేటెడ్ నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం నుంచి కాపాడేందుకు బ్యాంకులు టెన్యూర్‌ కాలాన్ని పెంచుతున్నాయి. అయితే, కొన్నిసార్లు ఈ పొడిగింపులు ఎక్కువ కాల కొనసాగడంతో రుణాలు చెల్లించే సమయంలో రుణ గ్రహితలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఈ తరుణంలో రుణగ్రహీతల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, హోమ్‌లోన్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల కొన్ని రీపేమెంట్ నిబంధనలను రూపొందించింది . ఇందులో కొత్తదనం ఏమిటి? ఇది గృహ రుణ గ్రహీతలకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది?  

హోమ్‌లోన్లపై ఆర్‌బీఐ కొత్త ఆదేశాలు, చోటు చేసుకున్న మార్పులు

అయితే ఆగస్టు 18,2023న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో హౌస్‌లోన్‌ తీసుకున్న రుణదాతలు ఈఎంఐని పెంచడానికి లేదా లోన్ కాలపరిమితిని పొడిగించడానికి లేదా హోమ్ లోన్‌లపై వడ్డీ రేట్లను రీసెట్ చేసే సమయంలో రెండు ఆప్షన్‌లను ఉపయోగించుకోవచ్చని ఆర్‌బీఐ సూచించింది.  

1) ఈఎంఐ/టెన్యూర్‌..ఇలా రెండింటిలో మార్పుకు దారితీసే బెంచ్‌మార్క్ రేట్లలో మార్పుల్ని, వాటి ప్రభావాల్ని బ్యాంకులు ఇంటి రుణాలు తీసుకునే రుణగ్రహీతలకు తెలియజేయాలి.

2) వడ్డీ రీసెట్ సమయంలో, రుణగ్రహీతలకు స్థిర వడ్డీ రేటుకు మారే అవకాశం ఇవ్వాలి. ఫ్లోటింగ్ నుండి ఫిక్స్‌డ్‌కి మారడానికి వర్తించే అన్ని ఛార్జీలు లోన్ ప్రాసెసింగ్‌ సమయంలో వెల్లడించాలి.

3) రుణ గ్రహీతలకు లోన్ కాలపరిమితిని పొడిగించడానికి లేదా ఈఎంఐలలో మెరుగుదలను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలి. 

4) రుణదాతలు ఇంటి రుణంపై చెల్లించే ఈఎంఐ టెన్యూర్‌ కాలాన్ని పొడిగించడం వల్ల ప్రతికూల ఇబ్బందులు ఏర్పడకుండా చూసుకోవాలి. అంటే రుణాలు తీసుకునే సామర్ధ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా బ్యాంకులు రుణాలకు సంబంధించిన అంశాలపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదు. 

గృహ రుణాలపై కొత్త ఆర్‌బీఐ నియమం: ఇది రుణ గ్రహితలకు ఎలా ఉపయోగపడుతుంది?

ఉదాహరణకు మీరు 2020లో 20 సంవత్సరాలకు (240 నెలలు) 7% వడ్డీతో రూ. 50 లక్షల గృహ రుణాన్ని ఈఎంఐ చెల్లించడం ప్రారంభించారు అని అనుకుందాం. లోన్ తీసుకునే సమయంలో మీ నెలవారీ ఈఎంఐ నెలకు రూ. 38,765. మొత్తం వడ్డీ రూ.43.04 లక్షలు.

మూడేళ్ల తర్వాత వడ్డీ రేటు 9.25%కి పెరిగిందనుకుందాం. కొత్త ఆర్‌బీఐ ఆదేశం ప్రకారం, బ్యాంకులు మీ ఈఎంఐ లేదా టెన్యూర్‌ కాలాన్ని పెంచుకోవడానికి లేదా వడ్డీ రేటును రీసెట్ చేసేటప్పుడు పైన పేర్కొన్న రెండు ఆప్షన్‌లను ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలి. 

మీరు మీ 20 సంవత్సరాల లోన్‌ను మిగిలిన 17 సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేయాలనుకుంటే (3 సంవత్సరాలు గడిచినందున), మీ ఈఎంఐ నెలకు రూ. 44,978కి పెరుగుతుంది. మీరు లోన్ టెన్యూర్‌ ముగిసే సమయానికి మొత్తం రూ. 55.7 లక్షల వడ్డీ చెల్లించుకోవచ్చు. 


అయితే, మీరు మీ లోన్ కాలపరిమితిని పెంచుకోవాలనుకుంటే మీ లోన్ ఈఎంఐ రూ. 38,765 చెల్లిస్తే.. అదే లోన్ 321 నెలలు లేదా 26 సంవత్సరాల 10 నెలల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. లోన్ గడువు ముగిసే సమయానికి మీ మొత్తం వడ్డీ చెల్లింపు రూ. 88.52 లక్షలు అవుతుంది. ఈ సందర్భంలో మీరు అధిక ఈఎంఐకి బదులుగా ఈఎంఐ టెన్యూర్‌ కాలాన్ని పెంచుకుంటే మీరు రూ. 33 లక్షల అదనపు వడ్డీ చెల్లించకుండా ఉపశమనం పొందే అవకాశం లభిస్తుంది. 

మీరు హోమ్ లోన్ ఈఎంఐని పెంచాలా లేదా ఈఎంఐ చెల్లించే టెన్యూర్‌ కాలాన్ని పొడిగించాలా?
వడ్డీ రేటు పెరిగినప్పుడు, గృహ రుణగ్రహీత ఈఎంఐ లేదా లోన్ టెన్యూర్‌ కాలాన్ని ఎంపిక చేసుకోవడం మంచిదని ఆర్ధిక నిపుణులు సలహా ఇస్తున్నారు. 


(Disclaimer: హోమ్‌లోన్ల గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. రుణ గ్రహితలకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు తీసుకోవాలనుకుంటున్న హోమ్‌లోన్లు, ఇతర లోన్లపై సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)