రూ.24.99 లక్షల అమెరికన్ బ్రాండ్ కారు: భారత్‌లో లాంచ్

Published on Tue, 10/22/2024 - 17:06

జీప్ కంపెనీ భారతదేశంలో తన మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్‌ను రూ. 24.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది దాని మునుపటి మోడల్ మాదిరిగా కాకుండా అప్డేటెడ్ కాస్మొటిక్ డిజైన్ కలిగి 5 సీటర్, 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. కొత్త మెరిడియన్ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలివరీలు ఈ నెల చివరలో ప్రారంభమవుతాయి.

అప్డేటెడ్ మెరిడియన్ లాంగిట్యూడ్, లాంగిట్యూడ్ ప్లస్, లిమిటెడ్ (ఓ), ఓవర్‌ల్యాండ్ అనే నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఎంట్రీ-లెవల్ లాంగిట్యూడ్ ట్రిమ్ 5-సీటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంది. మిగిలిన మూడు ట్రిమ్‌లు 7-సీటర్‌గా మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

జీప్ మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్ ఐకానిక్ సెవెన్-స్లాట్ గ్రిల్‌తో హనీకూంబ్ మెష్ క్రోమ్ స్టడ్‌లను పొందుతుంది. ఇది 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. క్యాబిన్ లేఅవుట్ మునుపటి మాదిరిగానే ఉన్నప్పటికీ.. డ్యాష్‌బోర్డ్ కాపర్ స్టిచింగ్‌తో కొత్త స్వెడ్ ఫినిషింగ్‌ని పొందింది. 9 స్పీకర్ ఆల్పైన్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి వాటితో పాటు.. ఈ కారులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, లెవెల్ 2 ఏడీఏఎస్ వంటివి ఉన్నాయి.

ఇదీ చదవండి: గూగుల్‌లో ఉచిత భోజనం ఎందుకంటే?: సుందర్ పిచాయ్

జీప్ మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 170 హార్స్ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 4x2, 4x4 వేరియంట్‌లతో పాటు 6 స్పీడ్ మాన్యువల్ & 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము.

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)