Breaking News

ఇది టైప్‌ చేశారంటే అంతే.. ఐఫోన్‌ క్రాష్‌!

Published on Thu, 08/22/2024 - 13:25

ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లలో కొత్త బగ్‌ ఒకటి బయటపడింది. కొన్ని అక్షరాలను టైప్‌ చేస్తే ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు క్రాష్‌ అవుతున్నాయి. “”: తర్వాత ఏదైనా అక్షరం టైప్ చేయగానే స్ప్రింగ్‌బోర్డ్ అని పిలిచే యాపిల్‌ డివైజ్‌ ఇంటర్‌ఫేస్ క్షణంలో క్రాష్ అయ్యి తిరిగి లాక్ స్క్రీన్‌కి వెళ్తోంది.

ఈ విషయాన్ని మొదట ఓ సెక్యూరిటీ రీసెర్చర్‌ గుర్తించారు. ఆ తర్వాత టెక్‌ పబ్లికేషన్‌ ‘టెక్‌క్రంచ్‌’ కూడా దీన్ని పరీక్షించింది. సెట్టింగ్స్‌ యాప్‌ లేదా యాప్ యాప్‌ లైబ్రరీలోని సెర్చ్‌ బార్‌లో ఈ అక్షరాలను టైప్ చేయగా క్రాష్‌ అవుతోందని  ధ్రువీకరించింది. కొన్ని సందర్భాల్లో డివైజ్‌ సాధారణ స్థితికి రావడానికి ముందు స్క్రీన్ ఒక సెకను బ్లాక్‌గా ఫ్లాష్ కావచ్చని పేర్కొంది.

అయితే ఈ బగ్ భద్రతా ముప్పు కాదని నిపుణులు చెబుతున్నారు. ఐఓఎస్‌ సెక్యూరిటీ రీసెర్చర్‌ అయిన రియాన్‌ స్టోర్జ్‌ సమస్యను విశ్లేషిస్తూ ఇది మీ డివైజ్‌ భద్రతకు హాని కలిగించదని నిర్ధారించారు. డబుల్‌యూ అనే సెక్యూరిటీ స్టార్టప్‌ని స్థాపించిన మరో ఐఓఎస్‌ నిపుణుడు పాట్రిక్‌ వార్డ్‌లే కూడా బగ్ కొంచెం ఇబ్బంది కలిగించేదే అయినా ప్రమాదకరం కాదని అంగీకరిస్తున్నారు.

కాగా ఈ బగ్‌పై యాపిల్‌ ఇంకా స్పందించలేదు. అయితే వారు భవిష్యత్తు అప్‌డేట్‌లో దాన్ని పరిష్కరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి  ఈ అసౌకర్యాన్ని నివారించాలనుకుంటే, మీ ఐఫోన్‌, ఐప్యాడ్‌ సెర్చ్ బార్‌లలో “”: అని మాత్రం టైప్ చేయొద్దు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)