Breaking News

దూసుకెళ్తున్న కొత్త హ్యుందాయ్ వెర్నా బుకింగ్స్: ఇప్పటికే..

Published on Thu, 03/23/2023 - 12:13

2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన కొత్త హ్యుందాయ్ వెర్నా ఇటీవలే దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలైంది. కంపెనీ ఈ సెడాన్ కోసం గత నెలలోనే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే ఇప్పటికి ఈ కొత్త మోడల్ కోసం ఎనిమిది వేల కంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చినట్లు సమాచారం.

2023 వెర్నా బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ. 25,000 చెల్లించి హ్యుందాయ్ డీలర్‌షిప్‌ ద్వారా లేదా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో లొకేషన్, బుక్ చేసుకునే వేరియంట్ ఆధారంగా  వెయిటింగ్ పీరియడ్ సుమారు రెండు నెలల వరకు ఉంటుందని భావిస్తున్నారు.

దేశీయ మార్కెట్లో విడుదలైన సరికొత్త హ్యుందాయ్ వెర్నా రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్లను కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ (IVT)తో వచ్చే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, మరొకటి 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 7 స్పీడ్ డిసిటి కలిగిన 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్. ఇవి రెండూ ఉత్తమమైన పనితీరుని అందిస్తాయి.

(ఇదీ చదవండి: ఇది కదా సక్సెస్ అంటే: ఒకప్పుడు ట్యూషన్ టీచర్.. ఇప్పుడు వంద కోట్లకు అధిపతి!)

కొత్త హ్యుందాయ్ వెర్నా డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా అప్డేట్ పొందింది. ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. దేశీయ విఫణిలో హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న ఈ సెడాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)