Breaking News

అందరికీ నచ్చిన కారు.. రూ.20 వేలు పెరిగిన ధర!

Published on Sat, 03/28/2026 - 14:58

హ్యుందాయ్ మోటార్ ఇండియా.. తన కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన వెన్యూ ధరలను పెంచింది. పెంచిన ధరలు పెట్రోల్ మరియు డీజిల్ మోడళ్లకు వర్తిస్తాయి. ధరలు రూ. 5000 నుంచి రూ.20000 వరకు పెరిగింది. దీంతో ధరలు శ్రేణి రూ. 7.99 లక్షల నుంచి రూ. 15.51 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది.

పెట్రోల్ వేరియంట్స్
హ్యుందాయ్ కంపెనీ అత్యధికంగా 1.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మాన్యువల్ ఇంజన్ ఎంపికలో లభించే HX5 ట్రిమ్‌ వేరియంట్ ధరలను రూ.20000 పెంచింది. కాబట్టి ఈ వేరియంట్ ధర రూ. 9.55 లక్షలకు చేరింది. బేస్ మోడల్ ధర రూ.8.00 లక్షల వద్ద ఉంది. అయితే ఇక HX5+, HX6T వంటి వేరియంట్స్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు.

1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ DCT వేరియంట్స్ ధరలు స్వల్పంగా పెరిగాయి. HX5 DCT ధర రూ. 10.90 లక్షలు (రూ. 9,000 పెరిగింది), HX6 DCT ధర రూ. 12.16 లక్షలు (రూ. 9,000 పెరిగింది), HX8 DCT ధర రూ. 12.99 లక్షలు (రూ. 5,000 పెరిగింది). బేస్ మోడల్ HX2 టర్బో ధర రూ. 8.89 లక్షల వద్ద ఉంది. అయితే ఎన్ లైన్ వేరియంట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

డీజిల్ వేరియంట్స్
1.5-లీటర్ డీజిల్ వేరియంట్ల ధరలు రూ. 8,000 పెరిగాయి. దీంతో HX2 ధర ఇప్పుడు రూ. 9.87 లక్షలు, HX5 రూ. 10.87 లక్షలు, HX5 AT రూ. 11.81 లక్షలు, HX7 రూ. 12.69 లక్షలు వద్దకు చేరాయి. టాప్-ఎండ్ HX8 AT, HX10 AT ధరలు వరుసగా రూ. 13.69 లక్షలు, రూ. 15.51 లక్షలుగా ఉన్నాయి.

కియా సోనెట్, టాటా నెక్సాన్, మహీంద్రా XUV 3ఎక్స్ఓ, మారుతి బ్రెజ్జా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా నిలిచిన హ్యుందాయ్ వెన్యూ ధరలు పెరగడం అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆన్-రోడ్ ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా, పన్నులు, బీమా కారణంగా నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి.

#

Tags : 1

Videos

అమరావతి పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నావ్ .. KK రాజు సంచలన రియాక్షన్

మ్యాచ్ మధ్యలో కుక్క ఎంట్రీ.. ఢిల్లీ ప్లేయర్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు

రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో రగడ..CI బాజీలాల్ పై మార్గాని భరత్ ఫైర్

గ్యాస్ కోసం ఆటోవాలాల కష్టాలు కిలోమీటర్ల మేర వాహనాలు

2029లో జగన్ వస్తాడనే భయంతోనే అమరావతిపై చట్టబద్ధత బిల్లు..

తెలంగాణలో రానున్న 5 రోజులు భారీ వర్షాలు

తృణమూల్ కాంగ్రెస్ పాలనపై పుస్తకాన్ని విడుదల చేసిన అమిత్ షా

రూపం మార్చుకొని మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్..

అమెరికా సంచలన ప్రకటన ఇరాన్ పని ఖతం!

అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్ దాడులు

Photos

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌ (ఫొటోలు)

+5

మార్కాపురం బస్సు ప్రమాదం.. హృదయ విదారక దృశ్యాలు

+5

అనంతపురంలో దేవరకొండ, రష్మిక సందడి (ఫొటోలు)