Breaking News

కొత్త ఫండ్స్‌ గురూ.. రూ.500 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు

Published on Mon, 12/09/2024 - 08:57

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్, కొత్తగా యాక్సిస్‌ క్రిసిల్‌–ఐబీఎక్స్‌  ఎఎఎ బాండ్‌ ఎన్‌బీఎఫ్‌సీ–హెచ్‌ఎఫ్‌సీ–జూన్‌ 2027 ఇండెక్స్‌ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది క్రిసిల్‌– ఐబీఎక్స్‌ ఎఎఎ ఎన్‌బీఎఫ్‌సీ–హెచ్‌ఎఫ్‌సీ ఇండెక్స్‌–జూన్‌ 2027లోని సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టే ఓపెన్‌–ఎండెడ్‌ టార్గెట్‌ మెచ్యూరిటీ ఇండెక్స్‌ ఫండ్‌. ఈ స్కీములో ఒక మోస్తరు వడ్డీ రేటు రిస్కు, మిగతా సాధనాలతో పోలిస్తే తక్కువ క్రెడిట్‌ రిస్కు ఉంటాయి. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. డిసెంబర్‌ 10 వరకు ఇది అందుబాటులో ఉంటుంది.

శామ్కో మల్టీ అసెట్‌ అలోకేషన్‌ ఫండ్‌ 
శామ్కో అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ.. కొత్తగా శామ్కో మల్టీ అసెట్‌ అలోకేషన్‌ ఫండ్‌ను ప్రారంభించింది.  ఈ నెల 4న ప్రారంభమైన న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో), ఈ నెల 18 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈక్విటీలు, బంగారం, డెట్, ఆర్బిట్రేజ్‌ సాధనాల్లో ఈ ఫండ్‌ పెట్టుబడులు పెడుతుంది. ఆయా విభాగాల్లో ఆకర్షణీయమైన అవకాశాలకు అనుగుణంగా కేటాయింపుల్లోనూ మార్పులు, చేర్పులు చేస్తుంటుంది.

ఈక్విటీలు ర్యాలీ చేసే సమయంలో వాటికి కేటాయింపులు పెంచడం, ఈక్విటీలు అధిక వ్యాల్యూషన్లకు చేరి నిదానించిన సమయంలో బంగారంలోకి పెట్టుబడులు తరలించడం తదితర వ్యూహాలను అనుసరిస్తుంది. తద్వారా రిస్క్‌ను అధిగమించి, మెరుగైన రాబడులు ఇచ్చే విధంగా పనిచేస్తుంది. ఈక్విటీలకు 20–80 శాతం మధ్య, డెట్‌కు 10–70 శాతం మధ్య, బంగారం, సిల్వర్‌ ఈటీఎఫ్‌లకు 10–70 శాతం మధ్య అవకాశాలకు అనుగుణంగా కేటాయింపులు చేస్తుంది. 30 శాతం వరకు కమోడిటీ డెరివేటివ్‌లు, 10 శాతం వరకు రీట్‌లు, ఇన్విట్‌లలోనూ పెట్టుబడులు పెడుతుంది. ఎన్‌ఎఫ్‌వోలో భాగంగా ఒకరు కనీసం రూ.5,000 నుంచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

ఇన్వెస్కో ఇండియా మల్టీ అసెట్‌ అలోకేషన్‌ ఫండ్‌ 
ఈక్విటీ, డెట్, గోల్డ్‌ ఈటీఎఫ్‌లు/సిల్వర్‌ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్‌ చేసే ఇన్వెస్కో ఇండియా మల్టీ అసెట్‌ అలోకేషన్‌ ఫండ్‌ను ఇన్వెస్కో మ్యుచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది. ఈ ఓపెన్‌ ఎండెడ్‌ న్యూ ఫండ్‌ ఆఫర్‌ డిసెంబర్‌ 11 వరకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. సిప్‌ విధానంలో రూ. 500 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. ఈక్విటీలు, డెట్‌ సాధనాల్లో 10–80 శాతం వరకు, గోల్డ్‌ ఈటీఎఫ్‌లు/సిల్వర్‌ ఈటీఎఫ్‌లలో 10–50 శాతం వరకు ఈ ఫండ్‌ పెట్టుబడులు పెడుతుంది. అలాగే అవకాశాన్ని బట్టి విదేశీ సెక్యూరిటీస్‌లో 35 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)