Breaking News

మోతీలాల్‌ ఓస్వాల్‌ నుంచి కొత్త ఫండ్‌..

Published on Mon, 06/09/2025 - 15:27

బీఎస్‌ఈలో నమోదైన టాప్‌–1000 కంపెనీల్లో పెట్టుబడులకు అవకాశం కల్పించే లక్ష్యంతో మోతీలాల్‌ ఓస్వాల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ.. బీఎస్‌ఈ 1000 ఇండెక్స్‌ ఫండ్‌ పేరుతో న్యూ ఫండ్‌ ఆఫర్‌ను ప్రారంభించింది. ఈ నెల 19 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.500. అభిరూప్‌ ముఖర్జీ ఈ పథకానికి మేనేజర్‌గా వ్యవహరించనున్నారు. 

మార్కెట్‌ విలువ పరంగా టాప్‌100 లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో, తదుపరి మార్కెట్‌ విలువ పరంగా 150 మిడ్‌క్యాప్‌ కంపెనీలలో, ఆ తదుపరి 400 స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో, వీటి తర్వాత మార్కెట్‌ విలువ పరంగా 350 టాప్‌ మైక్రోక్యాప్‌ కంపెనీల్లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. టాప్‌250 కంపెనీలు మినహా మిగిలిన 750 కంపెనీలు స్మాల్, మైక్రోక్యాప్‌ కనుక అస్థిరతల రిస్క్‌ ఎక్కువగా ఉంటుందని ఇన్వెస్టర్లు గమనించాలి.

ఎమ్‌కే ఇన్వెస్ట్‌మెంట్‌ నుంచి ఎస్‌ఎంఐడీ క్యాప్‌ ఫండ్‌ 
ఎమ్‌కే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ సంస్థ తాజాగా ఎస్‌ఐఎండీ క్యాప్‌ గ్రోత్‌ ఇంజిన్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. 2025–26లో రూ. 500–1,000 కోట్ల ఏయూఎం (నిర్వహణలోని అసెట్స్‌ పరిమాణం) లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ఫండ్‌ ప్రధానంగా స్మాల్, మిడ్‌క్యాప్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. ద్రవ్యోల్బణం .. వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టడం, కుటుంబాల ఆదాయం మెరుగుపడుతూ, వినియోగం పెరుగుతుండటం తదితర అంశాలన్నీ స్మాల్, మిడ్‌ క్యాప్‌ షేర్లలో ఇన్వెస్ట్‌ చేసేందుకు సానుకూలంగా నిలుస్తున్నాయని సంస్థ డైరెక్టర్‌ మనీష్‌ సంతాలియా తెలిపారు. వచ్చే 3–5 ఏళ్లలో ఈ షేర్లు మెరుగైన రాబడులు అందించే అవకాశాలు ఉన్నందున, ఇన్వెస్టింగ్‌కు అనువైనవిగా కనిపిస్తున్నాయని వివరించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)