Breaking News

యాపిల్‌ ఐఫోన్‌ 14, ఎస్‌ఈ నిలిపివేత..కారణం..

Published on Mon, 12/30/2024 - 09:51

ప్రపంచ నంబర్‌ 1 కంపెనీ యాపిల్‌ కొన్ని ఉత్పత్తులను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఐఫోన్‌ 14, ఐఫోన్‌ ఎస్‌ఈ(3వ తరం) ఫోన్లను యూరప్‌లో నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాలకు ప్రామాణికంగా ఒకే రకమైన ఛార్జింగ్ పోర్టు ఉండాలనేలా యూరప్‌ ప్రభుత్వం(EU) నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణమని తెలిసింది.

యూరప్‌ ప్రభుత్వం అన్ని మోబైళ్లలో ప్రామాణికంగా యూఎస్‌బీ టైప్‌-సీ(Type-C) పోర్ట్‌తో ఉన్న ఛార్జింగ్‌ సదుపాయం ఉండాలనేలా నిబంధనలు తీసుకొచ్చింది. కానీ ప్రస్తుతం అధికారికంగా వాడుకలో ఉన్న ఐఫోన్‌ 14, ఐఫోన్‌ ఎస్‌ఈ(3వ తరం) ఫోన్లలో ప్రత్యేకంగా యాపిల్‌ ఛార్జింగ్‌ పోర్ట్‌ ఉంటుంది. ఇది యూరప్‌ నిబంధనలకు విరుద్ధం. దాంతో స్థానికంగా ఈ మోడళ్లను నిలిపేస్తున్నట్లు యాపిల్‌(Apple) ప్రకటించింది.

ఇదీ చదవండి: స్వల్ప స్థాయిలోనే కదలికలు

యాపిల్‌ ఐఫోన్‌ 14 తర్వాత విడుదల చేసిన మోడళ్లలో టైప్‌-సీ పోర్ట్‌ను తీసుకొచ్చింది. దాంతో ఐఫోన్‌ 15తోపాటు తదుపరి మోడళ్లకు ఈ సమస్య లేదు. ఇప్పటికే ఐఫోన్‌(IPhone) 14 వాడుతున్నవారికి ఇబ్బంది ఉండదు. కానీ కొత్తగా ఈ మోడల్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి మాత్రం యూరప్‌లో అందుబాటులో ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. అయితే ఇటీవల ఐఫోన్‌ 16 మోడల్‌ను విడుదల చేయడంతో చాలామంది ఈ మోడల్‌ను కొనుగోలు చేస్తున్నారని కంపెనీ వర్గాలు తెలిపాయి. యూరప్‌కు చెందిన వినియోగదారులకు 2025 ప్రారంభంలో యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌తో ఐఫోన్‌ ఎస్‌ఈ(IPhone SE) మోడల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ తెలిపింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)