Breaking News

కొత్త క్రెడిట్‌ కార్డ్‌.. లైఫ్‌ టైమ్‌ ఫ్రీ!

Published on Fri, 11/22/2024 - 10:50

ఎటువంటి జాయినింగ్‌ ఫీజు లేకుండా లైఫ్‌ టైమ్‌ ఫ్రీ ఆఫర్‌తో కొత్త క్రెడిట్ కార్డ్ వచ్చింది. యెస్ బ్యాంక్, ఎన్‌పీసీఐ భాగస్వామ్యంతో ఫిన్‌ టెక్‌ సంస్థ రియో.. ​​యెస్ బ్యాంక్ రియో ​​రూపే క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించింది.

యూపీఐతో మిళితం చేసిన ఈ క్రెడిట్ కార్డ్ లావాదేవీలను సులభతరం చేస్తుంది. దీని ద్వారా వినియోగదారులు దేశవ్యాప్తంగా 10 కోట్లకుపైగా వ్యాపార స్థానాల నుండి షాపింగ్ చేయవచ్చు. ఈ కార్డ్ రియో ​​యాప్‌లోని నో యువర్ ఆఫర్స్ ఫీచర్ ద్వారా వినియోగదారులకు రూ. 5 లక్షల వరకు క్రెడిట్ పరిమితి, వ్యక్తిగతీకరించిన రివార్డ్‌లు, ప్రత్యేకమైన డీల్స్‌ను అందిస్తుంది.

ఈ కార్డు కావాలంటే..
చిన్న నగరాల వినియోగదారులే ఈ కార్డుపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. దాని బీటా లాంచ్ సమయంలో 60 శాతం అప్లికేషన్లు టైర్ 2, టైర్ 3 నగరాల నుంచే వచ్చాయి. 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు, ఉద్యోగం లేదా స్వంత వ్యాపారం కలిగి ఉన్నవారెవరైనా ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. ఇందుకోసం దరఖాస్తుదారు కనీసం రూ. 25,000 నికర నెలవారీ జీతం లేదా రూ. 5 లక్షల వార్షిక ఆదాయపు పన్ను రిటర్న్ కలిగి ఉండాలి. అయితే ఇప్పటికే ఉన్న యెస్‌ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నవారు ఈ కొత్త కార్దుకు అర్హులు కాదు.

ఇదీ చదవండి: ఐటీ శాఖ కొత్త వార్నింగ్‌.. రూ.10 లక్షల జరిమానా

జీవితకాలం ఉచితం
ఈ కార్డ్ జీవితకాలం ఉచితం. జాయినింగ్ ఫీజు కూడా లేదు. ఈ కార్డ్ అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, కొన్ని నిర్దిష్ట లావాదేవీలకు ఛార్జీ ఉంటుంది. ఒక నెలలో రూ. 15,000 కంటే ఎక్కువ యుటిలిటీ చెల్లింపులపై 1% రుసుము, జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. క్రెడ్‌ లేదా ఫోన్‌పే వంటి థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా ఎడ్యుకేషన్ ఫీజుల చెల్లింపుపై 1% రుసుము, జీఎస్టీ ఉంటుంది. అదేవిధంగా రూ. 10,000లకు మించి ఇంధన లావాదేవీలకు ఒక్కో దానిపై 1% రుసుముతో పాటు జీఎస్టీ విధిస్తారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)