Breaking News

ఆగష్టులో విడుదలయ్యే కొత్త కార్లు ఇవే!

Published on Sun, 07/30/2023 - 11:51

Upcoming Cars: జులై నెల దాదాపు ముగిసింది. ఇక రెండు రోజుల్లో ఆగష్టు నెల రానుంది. అయితే ఆ నెలలో (ఆగష్టు) విడుదలయ్యే కొత్త కార్లు ఏవి? వాటి వివరాలు ఏంటనేది.. ఈ కథనంలో తెలుసుకుందాం.

టాటా పంచ్ సీఎన్‌జీ (Tata Punch CNG)
దేశీయ మార్కెట్లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన టాటా మోటార్స్ కంపెనీకి చెందిన మైక్రో ఎస్‌యువి త్వరలో సీఎన్‌జీ రూపంలో విడుదలకావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కారు 2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టింది. గత కొంత కాలంలో ఇది టెస్టింగ్ సమయంలో కూడా కనిపించింది. కావున ఈ కారు ఆగష్టు ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

సెకండ్ జనరేషన్ మెర్సిడెస్ బెంజ్ జిఎల్సీ (Second-gen Mercedes-Benz GLC)
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ 2023 ఆగష్టు 09న తన సెకండ్ జనరేషన్ జిఎల్సీ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తాహముగా అరంగేట్రం చేసిన ఈ కారు పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. డిజైన్ అండ్ ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవకాశం లేదు. ఆధునిక కాలంలో వినియోగదారులకు అవసరమైన అన్ని ఫీచర్స్ లభించనున్నట్లు స్పష్టమవుతోంది.

ఆడి క్యూ8 ఈ-ట్రాన్ (Audi Q8 e-tron)
జర్మనీ బ్రాండ్ కంపెనీ అయిన ఆడి కూడా ఆగష్టు 18న తన క్యూ8 ఈ-ట్రాన్ కారుని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంటుంది. రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ఫాసియా, రియర్ బంపర్‌ వంటి వాటిని కలిగిన ఈ కారు ఒక ఫుల్ ఛార్జ్‌తో 600 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న దుబాయ్ షేక్ కారు.. వీడియో వైరల్

టయోటా రూమియన్ (Toyota Rumion)
మనదేశంలో ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేసే కార్లు ఏవైన ఉన్నాయంటే అందులో 'టయోటా' కూడా ఉంటుంది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికాలో అందుబాటులో ఉన్న ఈ ఎంపివి త్వరలోనే ఇండియన్ మార్కెట్లో కూడా అడుగుపెట్టనుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 103 హార్స్ పవరే, 137 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. రానున్న రోజుల్లో ఇది సీఎన్‌జీ రూపంలో విడుదలయ్యే అవకాశం కూడా ఉంది.

ఇదీ చదవండి: ఆధార్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. పుట్టిన బిడ్డకు ఎంతో మేలు!

వోల్వో సీ40 రీఛార్జ్ (Volvo C40 Recharge)
స్వీడన్ కంపెనీకి చెందిన వోల్వో కంపెనీ త్వరలో సీ40 రీఛార్జ్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇది కంపెనీకి చెందిన రెండవ ఎలక్ట్రిక్ మోడల్ కావడం విశేషం. ఇది చూడటానికి దాదాపు దాని మునుపటి మోడల్ గుర్తుకు తెస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)