Breaking News

తగ్గిపోయిన కొత్త అఫోర్డబుల్‌ ఇళ్లు

Published on Mon, 05/27/2024 - 07:37

న్యూఢిల్లీ: దాదాపు రూ. 60 లక్షల వరకు ఖరీదు చేసే అఫోర్డబుల్‌ ధరల్లోని కొత్త ఇళ్ల సరఫరా జనవరి–మార్చి త్రైమాసికంలో తగ్గింది. ప్రాప్‌ఈక్విటీ డేటా ప్రకారం హైదరాబాద్‌ సహా ఎనిమిది ప్రధాన నగరాల్లో 33,420 యూనిట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 53,418 యూనిట్లతో పోలిస్తే ఇది 38 శాతం తక్కువ. 

మరోవైపు 2023 క్యాలెండర్‌ ఇయర్‌లో ఈ కేటగిరీలో సరఫరా 20 శాతం తగ్గిందని ప్రాప్‌ఈక్విటీ ఎండీ సమీర్‌ జసూజా తెలిపారు. 2022లో ఈ విభాగంలో 2,24,141 యూనిట్లు లాంచ్‌ కాగా 2023లో కేవలం 1,79,103 యూనిట్లు మాత్రమే లాంచ్‌ అయినట్లు వివరించారు. ఈ ఏడాది కూడా ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

‘రియల్‌ ఎస్టేట్‌ ధరలతో పాటు (గత రెండేళ్లుగా కొన్ని నగరాల్లో 50–100 శాతం పెరిగాయి), నిర్మాణ ఖర్చులు కూడా పెరిగిపోతుండటంతో అఫౌర్డబుల్‌ హౌసింగ్‌ ప్రాజెక్టులనేవి డెవలపర్లకు అంత లాభసాటిగా ఉండటం లేదు‘ అని జసూజా తెలిపారు. కరోనా అనంతరం పెద్ద ఇళ్లకు డిమాండ్‌ పెరుగుతుండటంతో డెవలపర్లు మధ్య స్థాయి, లగ్జరీ సెగ్మెంట్లపై దృష్టి పెడుతున్నారని, వీటిలో మార్జిన్లు కూడా ఎక్కువగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. 

డేటా ప్రకారం హైదరబాద్‌లో రూ. 60 లక్షల వరకు ఖరీదు చేసే కొత్త ఇళ్ల సరఫరా 2,319 యూనిట్ల నుంచి 2,116 యూనిట్లకు తగ్గింది. చెన్నైలో 501 తగ్గి 3,862 యూనిట్లకు పరిమితమైంది. పుణెలో సరఫరా 12,538 యూనిట్ల నుంచి ఏకంగా 6,836కి పడిపోయింది. బెంగళూరులో 657 యూనిట్లు తగ్గి 3,701కి, కోల్‌కతాలో 2,747 యూనిట్ల నుంచి 2,204 యూనిట్లకు అఫోర్డబుల్‌ ఇళ్ల సరఫరా తగ్గింది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)