Breaking News

అలా చేస్తే ముప్పే: యూజర్లకు యాపిల్‌ తీవ్ర హెచ్చరిక

Published on Wed, 08/23/2023 - 15:17

Apple Warning: టెక్‌ దిగ్గజం, ఐఫోన్‌ మేకర్‌ యాపిల్‌ కీలక హెచ్చరికలు జారీ చేసింది.  ముఖ్యంగా ఫోన్‌ను పక్కనే పెట్టుకొని నిద్రపోయే అలవాటు ఉన్న వ్యక్తుల కోసం కీలక హెచ్చరిక జారీ చేసింది. స్మార్ట్‌ఫోన్‌ ఛార్జింగ్‌లో ఉండగా పక్కన పెట్టుకుని నిద్రపోవడం ప్రమాదకరమని   హెచ్చరించింది. అంతేకాదు ఈ సూచనలను తమ ఆన్‌లైన్ యూజర్ గైడ్‌లో చేర్చింది. 

ఐఫోన్లను సరైన వెలుతురు ఉన్న వాతావరణంలోనూ, టేబుల్‌ల వంటి ఫ్లాట్ ఉపరి తలాలపై మాత్రమే  ఛార్జింగ్ చేయాలని సలహా ఇచ్చింది. దుప్పట్లు, దిండ్లు, శరీరం వంటి మృదువైన ఉపరితలాలపై  ఉంచి చార్జ్‌ చేయవద్దని సూచించింది. ఛార్జింగ్ ప్రక్రియలో ఐఫోన్లు కొంత వేడిని ఉత్పత్తి చేస్తాయని, ఫలితంగా ఫోన్ కింద ఉన్న భాగం కాలిపోవడం, లేదా కొన్ని సందర్భాల్లో మంటలంటుకోవడంతో ప్రమాదాలకు దారి తీస్తాయని తెలిపింది. అలాగే,ఘై‌ను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు పవర్ అడాప్టర్, వైర్‌లెస్ ఛార్జర్‌పై నిద్రపోవద్దని సూచించింది. వాటిని పవర్ సోర్స్‌కి కనెక్ట్చేసినప్పుడు దుప్పటి, దిండు, శరీరం కింద ఉంచొద్దంటూ  తన యూజర్లకు మార్గ దర్శకాలు జారీ చేసింది.  అంతేకాదు దెబ్బతిన్న కేబుల్స్ లేదా ఛార్జర్‌లను ఉపయోగించడం లేదా తేమగా  ఉన్న ప్రదేశాల్లో చార్జింగ్‌ చేయకూడదని సలహా ఇచ్చింది.

కాగా పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు చివరికి వాష్‌ రూంలో కూడా వదలకుండా ఫోన్‌ వాడటం ఇపుడు అందరికీ అలవాటుగా మారిపోయింది.  అంతేకాదు చార్జింగ్‌లో ఉన్నపుడు చాలాసార్లు ఫోన్‌ పేలిన ప్రమాదాల్లోప్రాణాల్లో కోల్పోతున్న ఘటనలు కూడా చాలానే చూశాం. ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్‌ వినియోగం ప్రమాదకరమనీ, సిగ్నల్ లేని సమయంలో వాడితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని  కూడా  ఇప్పటికే పలు అధ్యయనం హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)