Breaking News

న్యూరాలింక్ బ్రెయిన్‌ చిప్‌ ప్రయోగం సక్సెస్‌

Published on Thu, 08/22/2024 - 10:11

బిలియనీర్‌ ఇలాన్ మస్క్‌కు చెందిన బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్  పక్షవాత బాధితుల కోసం రూపొందించిన ఇంప్లాంట్ రెండవ ట్రయల్ విజయవంతమైంది. అలెక్స్‌ అనే వ్యక్తికి అమర్చిన రెండో ఇంప్లాంట్‌ బాగా పని చేస్తోందని, మొదటి సారి తలెత్తిన సమస్యలేవీ ఇప్పుడు ఎదురుకాలేదని కంపెనీ తెలిపింది.

న్యూరాలింక్ మొదటి ఇంప్లాంట్‌ను నోలాండ్ అర్బాగ్‌ అనే వ్యక్తికి గత జనవరిలో అమర్చారు. అయితే శస్త్రచికిత్స తర్వాత ఇంప్లాంట్‌కు సంబంధించిన అత్యంత సూక్ష్మమైన ఎలక్ట్రోడ్‌ వైర్లు మెదడు నుంచి బయటకు వచ్చాశాయి. ఫలితంగా మెదడు సంకేతాలను అంచనా వేయడంలో సమస్య ఏర్పడింది. తర్వాత దీన్ని పరిష్కరించినట్లు న్యూరాలింక్ పేర్కొంది. కాగా జంతువులపై నిర్వహించిన ట్రయల్స్‌లోనే న్యూరాలింక్‌కు ఈ సమస్య గురించి తెలుసని రాయిటర్స్‌ నివేదించింది.

ఇలాంటి సమస్య రెండవ రోగిలో పునరావృతం కాకుండా నివారించడానికి శస్త్రచికిత్స సమయంలో మెదడు కదలికను తగ్గించడంతోపాటు ఇంప్లాంట్, మెదడు ఉపరితలం మధ్య గ్యాప్‌ను తగ్గించడం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. రెండవ రోగికి న్యూరాలింక్‌ ఈ పరికరాన్ని విజయవంతంగా అమర్చింది. వీడియో గేమ్‌లు ఆడటానికి, త్రీడీ వస్తువులను ఎలా రూపొందించాలో తెలుసుకోవడానికి ఈ బ్రెయిన్‌ చిప్‌ను ఆ వ్యక్తి ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు