Breaking News

తొమ్మిదేళ్లలో మూడింతలు

Published on Mon, 07/03/2023 - 05:03

న్యూఢిల్లీ: కేంద్రం అమలు చేస్తున్న సంస్కరణల ఊతంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) లాభాలు గత తొమ్మిదేళ్లలో మూడు రెట్లు పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. రూ. 1.04 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడేలా భవిష్యత్‌లోనూ ఈ ధోరణిని పీఎస్‌బీలు కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. 2014 ఆర్థిక సంవత్సరంలో రూ. 36,270 కోట్లుగా ఉన్న పీఎస్‌బీల లాభాలు 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు మూడు రెట్లు పెరిగి రూ. 1.04 లక్షల కోట్లకు చేరాయి.

పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌ కార్పొరేట్‌ ఆఫీసును ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఈ విజయాలను చూసి పొంగిపోతూ పీఎస్‌బీలు అలసత్వం వహించరాదని, అత్యుత్తమ కార్పొరేట్‌ గవర్నెన్స్‌ విధానాలను, నియంత్రణ సంస్థ నిబంధనలను, పటిష్టమైన అసెట్‌–లయబిలిటీ .. రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ విధానాలను పాటిస్తూ పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవాలని ఆమె సూచించారు. గతంలో ఇటు బ్యాంకులు అటు కార్పొరేట్ల బ్యాలన్స్‌ షీట్లూ ఒత్తిడిలో ఉండేవని .. ప్రస్తుతం అటువంటి పరిస్థితి నుంచి బైటపడ్డాయని మంత్రి చెప్పారు.

బ్యాంకుల అసెట్లపై రాబడులు, నికర వడ్డీ మార్జిన్లు, ప్రొవిజనింగ్‌ కవరేజీ నిష్పత్తి మొదలైనవన్నీ మెరుగుపడ్డాయన్నారు. రుణాల వినియోగం జాతీయ సగటుకన్నా తక్కువగా ఉన్న రాష్ట్రాలపై, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలపై, బ్యాంకులు ప్రధానంగా దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. అలాగే, ప్రత్యేక డ్రైవ్‌లు, ప్రచార కార్యక్రమాల ద్వారా మహిళా సమ్మాన్‌ బచత్‌ పత్రాలకు ప్రాచుర్యం కలి్పంచాలని చెప్పారు. ప్రాధాన్యతా రంగాలకు రుణాల కోసం ఉద్దేశించిన నిధులను గ్రామీణ ప్రాంత మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధికి బదలాయించడం కాకుండా, ఆయా లక్ష్యాల సాధన కోసం పూర్తి స్థాయిలో వినియోగించడంపై దృష్టి పెట్టాలని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు