ఇంటి పొదుపు రూ.22 లక్షల కోట్లు..! ఎస్‌బీఐ అంచనా

Published on Sat, 05/31/2025 - 07:38

కోల్‌కతా: గృహాల నికర పొదుపులు గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) రూ.22 లక్షల కోట్ల మేర ఉండొచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్‌ తన అంచనాలు ప్రకటించింది. జాతీయ స్థూల ఖర్చు చేయతగిన ఆదాయం (జీఎన్‌డీఐ)లో ఇది 6.5 శాతానికి సమానమని పేర్కొంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో గృహ నికర పొదుపులు జీఎన్‌డీఐలో 5.1 శాతంగా ఉంటే, దీంతో పోల్చితే గత ఆర్థిక సంవత్సరంలో 4.9 శాతం మేర పెరిగినట్టు తెలిపింది.

ఆర్థిక పొదుపులు పెరగడం అన్నది ప్రభుత్వం, కార్పొరేట్‌ నిధుల లోటును భర్తీ చేసేందుకు, స్థూల ఆర్థిక స్థిరత్వానికి ఎంతో కీలకమని ఎస్‌బీఐ రీసెర్చ్‌ రిపోర్ట్‌ తెలిపింది. ఈ సందర్భంగా ఆర్‌బీఐ మిగులు నిల్వలను ప్రస్తావించింది. రూపాయి అస్థిరతల కట్టడికి సెంట్రల్‌బ్యాంక్‌ తీసుకునే చర్యలు ఈ పరిమాణాన్ని నిర్దేశిస్తాయని తెలిపింది. 2024–25లో ఆర్‌బీఐ బ్యాలన్స్‌ షీటు 8.19 శాతం విస్తరించగా.. అదే ఏడాది జీడీపీ వృద్ధి రేటు 9.9 శాతం కంటే తక్కువగా ఉన్నట్టు పేర్కొంది.

ఆర్‌బీఐ మిగులు నిల్వలు రూ.2.69 లక్షల కోట్లను ప్రభుత్వానికి బదిలీ చేయడం (డివిడెండ్‌) ద్రవ్య వెసులుబాటును ఇస్తుందని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో మోసాల కేసులు తగ్గినప్పటికీ.. మోసపోయిన మొత్తం మూడు రెట్లు పెరిగి రూ.36,014 కోట్లకు చేరినట్టు గుర్తు చేసింది.

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)