Breaking News

ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.16.90 లక్షల కోట్లు

Published on Tue, 01/14/2025 - 04:40

న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను నికర వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి 12వ తేదీ నాటికి (2024 ఏప్రిల్‌ 1 నుంచి) 16 శాతం పెరిగి రూ.16.90 లక్షల కోట్లకు ఎగశాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్‌ (సీబీడీటీ) గణాంకాల ప్రకారం మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో వ్యక్తిగత పన్ను వసూళ్లు రూ.8.74 లక్షల కోట్లు. కార్పొరేట్‌ వసూళ్లు రూ. 7.68 లక్షల కోట్లు. సెక్యూరిటీ లావాదేవీల పన్ను వసూళ్లు రూ.44,538 కోట్లు.  

రిఫండ్స్‌ రూ.3.74 లక్షల కోట్లు 
స్థూలంగా చూస్తే, జనవరి 12 నాటికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 20.64 లక్షల కోట్లు. ఇందులో రిఫండ్స్‌ రూ.3.74 లక్షల కోట్లు. (వార్షికంగా 42.49 శాతం పెరుగుదల). వెరసి నికర వసూళ్లు రూ. 16.90 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 

లక్ష్యం రూ.22.07 లక్షల కోట్లు 
ప్రత్యక్ష పన్నుల ద్వారా మార్చితో ముగిసే ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో  రూ.22.07 లక్షల కోట్లు వసూలు చేయాలన్నది వార్షిక బడ్జెట్‌ లక్ష్యం. ఇందులో కార్పొరేట్‌ పన్ను వసూళ్ల వాటా రూ.10.20 లక్షల కోట్లు. వ్యక్తిగత ఆదాయ, ఇతర పన్నుల ద్వారా వసూళ్లు రూ.11.87 లక్షల కోట్లు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)